ETV Bharat / bharat

'కాన్సంట్రేటర్ల'తో ప్రాణవాయువు.. మీ చెంతనే

దేశంలో మరోసారి కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. మునుపటి కంటే తీవ్రంగా విరుచుకుపడుతోంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కొవిడ్‌ రోగులకు ప్రాణవాయువు అత్యవసరంగా మారింది. కానీ.. చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్‌ సిలిండర్లు సరిపడా అందుబాటులో లేక అనేక మంది రోగులు అవస్థలు పడుతున్నారు. చాలీచాలనీ సిలిండర్లతో ఆసుపత్రులూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో 'ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు' వరంగా మారుతున్నాయి. ఇంతకీ ఏంటీ కాన్సంట్రేటర్లు.? ఎలా పనిచేస్తాయి.. ఎక్కడ లభిస్తాయి.? తెలుసుకుందాం..

Oxygen Concentrator 2021
ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్
author img

By

Published : Apr 17, 2021, 8:17 PM IST

దేశంలో కరోనా 2.0 ఉగ్రరూపం దాల్చుతున్న వేళ.. కొవిడ్​ రోగులకు ఆక్సిజన్​ అత్యవరసరంగా మారింది. అనేక ప్రాంతాల్లో ప్రాణవాయువు సరఫరా లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో 'ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు' ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి.

పనితీరు ఎలా..

తమంతట తాము ఆక్సిజన్‌ తీసుకోలేని స్థితిలో ఉన్న రోగులకు ఆక్సిజన్‌ అందిస్తుంటారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రోగుల ప్రాణాలను రక్షించడం కోసం సరైన సమయంలో ప్రాణవాయువు అందించడం అత్యంత కీలకం. సాధారణంగా ఆసుపత్రుల్లో ఇందుకోసం ఆక్సిజన్‌ సిలిండర్లను ఉపయోగిస్తారు. నాజల్‌ కాన్యులా లేదా ఆక్సిజన్‌ మాస్క్‌ల ద్వారా ఈ సిలిండర్ల నుంచి రోగులకు ప్రాణవాయువు అందిస్తారు. అచ్చం ఇలా పనిచేసేవే 'ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు'. చూడటానికి బ్రీఫ్‌కేస్‌ లేదా వాటర్‌ ప్యూరిఫయర్‌ ఆకారంలో ఉంటాయి. అయితే సిలిండర్లలో నిర్ణీత పీడనంతో ఆక్సిజన్‌ ఉంటే.. కాన్సంట్రేటర్లు మాత్రం మన చుట్టూ ఉన్న గాలి నుంచి ఆక్సిజన్‌ను సేకరించి గ్రహించి.. దాన్ని ఫిల్టర్‌ చేసి, గాఢతను పెంచి రోగులకు చేరవేస్తుంటాయి. అందుకే వీటిని కాన్సంట్రేటర్లుగా పిలుస్తారు. బ్యాటరీ లేదా విద్యుత్‌తో ఇవి పనిచేస్తాయి.

ఇదీ చదవండి: 'ఆక్సిజన్'​ కొరతతో నలుగురు కరోనా రోగులు మృతి

సిలిండర్లకు.. కాన్సంట్రేటర్లకు తేడా ఏంటి?

పనితీరు పరంగా రెండింటి లక్ష్యం ఆక్సిజన్‌ అందించడమే. అయితే కాన్సంట్రేటర్లలో నిర్ణీత పీడనంలో ఉన్న ఆక్సిజన్‌ ఉండదు కాబట్టి.. దీనికి బలమైన లోహపు ట్యాంక్‌ అవసరం లేదు. తేలికైన ప్లాస్టిక్‌తో దీన్ని తయారుచేయడం వల్ల వీటిని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లొచ్చు. సాధారణంగా ఇంట్లో ఆక్సిజన్‌ థెరపీ తీసుకునేవాళ్లు వీటిని వినియోగిస్తుంటారు. మరో విశేషమేంటంటే.. గాలి నుంచే ఆక్సిజన్‌ను గ్రహిస్తుంది గనుక, సిలిండర్ల మాదిరిగా ఇందులో ఎప్పటికీ ఆక్సిజన్‌ అయిపోదు.

ఇదీ చదవండి: 'దిల్లీలో పరిస్థితులు మరింత ఆందోళకరం'

పెరుగుతున్న డిమాండ్‌..

సాధారణంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న రోగులకు ఈ ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లకు ఎక్కువగా వినియోగిస్తుంటారు. రోగులకు ఇంట్లోనే వీటిని ఏర్పాటు చేస్తే పదేపదే ఆసుపత్రులకు రావాల్సిన అవసరం ఉండదు. చిన్న చిన్న ఆసుపత్రుల్లోనూ వీటిని ఉపయోగిస్తుంటారు. అంతకుముందు ఇవి పెద్దగా ప్రచారంలో లేవు. అయితే ఇప్పుడు కరోనా రెండో దశలో ఆక్సిజన్‌ కొరత ఎక్కువవుతుండటంతో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. దీంతో ఇప్పుడు వీటికి డిమాండ్‌ భారీగా పెరిగింది. గతంలో నెలకు ఐదు నుంచి ఆరు యూనిట్లు మాత్రమే విక్రయించే తయారీ సంస్థలకు ఇటీవలికాలంలో భారీ ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. అమెజాన్‌ వంటి ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లలోనూ అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ. 40వేల పైనే ఉంది. డిమాండ్‌ను బట్టి ధర పెరిగే అవకాశముందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి: ఆ ఆస్పత్రిలో కొవిడ్​ రోగులకు మ్యూజిక్​ థెరపీ!

ప్రతికూలతలూ లేకపోలేదు..

ఆక్సిజన్‌ సిలిండర్లతో పోలిస్తే కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కాన్సంట్రేటర్లతో ప్రతికూలతలూ కూడా ఉన్నాయి. ఇందులో పీడనం కలిగిన ఆక్సిజన్‌ ఉండదు కాబట్టి.. ప్రతిసారీ ఆక్సిజన్‌ విడుదల చేయాలంటే కాన్సంట్రేటర్‌ తప్పనిసరిగా బ్యాటరీ లేదా విద్యుత్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. పవర్‌ ఉంటే గాలిని ఫిల్టర్‌ చేసి, సరఫరా చేయడానికి కుదురుతుంది. అంతేకాకుండా.. దీని పనితీరు కాస్త సంక్లిష్టంగా ఉండటం కూడా ఒక్కోసారి గందరగోళానికి గురిచేస్తుంది.

ఏదిఏమైనా.. ప్రస్తుత ఆక్సిజన్‌ కొరత సమయంలో ఈ కాన్సంట్రేటర్లు కరోనా రోగులకు కాస్త ఊరటనిచ్చే అంశమే అని వైద్యరంగ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: ఆక్సిజన్, రెమ్​డెసివిర్, టీకా కొరతపై రాష్ట్రాల ఫిర్యాదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.