Honor X9c Launched: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ తన కొత్త 'హానర్ ఎక్స్9సి' స్మార్ట్‌ఫోన్‌ను మలేషియా మార్కెట్లో లాంచ్ చేసింది. 2 మీటర్ల ఎత్తు నుంచి కిందికి పడిపోయినా కూడా ఏం కాకుండా ఉండేలా ఈ మొబైల్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఇది IP65M రేటింగ్‌తో డస్ట్, 360-డిగ్రీల వాటర్ రెసిస్టెన్సీతో వస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్‌తో పాటు 12GB వరకు ర్యామ్‌ని కలిగి ఉంది. ఇందులో 6,600mAh బిగ్ బ్యాటరీని అమర్చారు. ఇది 66W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14-బేస్డ్ MagicOS 8.0 పై రన్ అవుతుంది. కంపెనీ ఇప్పటికే ఈ 'హానర్ ఎక్స్9సి' మొబైల్ ప్రీ-ఆర్డర్స్‌ను సింగపూర్‌లోని ఆన్లైన్ రిటైల్ స్టోర్‌లో ప్రారంభించింది.
హానర్ X9c స్పెసిఫికేషన్లు:
- డిస్ప్లే: 6.78-అంగుళాల 1.5K (1,224 x 2,700 pixels) AMOLED
- రిఫ్రెష్ రేట్: 120Hz
- బ్రేట్నెస్: 4,000 నిట్స్
- చిప్సెట్: స్నాప్‌డ్రాగన్ 6 Gen 1
- బ్యాటరీ: 6,600mAh
- 66W వైర్డు ఛార్జింగ్
- 2 మీటర్ల డ్రాప్ రెసిస్టెన్సీ
- డస్ట్ రెసిస్టెన్సీ
- 360-డిగ్రీ వాటర్ రెసిస్టెన్సీ
- IP65M రేటింగ్
- Measures: 162.8 x 75.5 x 7.98 మిమీ
- బరువు: 189 గ్రాములు
- ఐ ప్రొటెక్షన్ ఫీచర్స్
కెమెరా: ఈ హానర్ X9c ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్, 5-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్‌ను కలిగి ఉంది. సెల్ఫీ కోసం ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.
కలర్ ఆప్షన్స్: ఈ మొబైల్ మూడు కలర్ ఆప్షన్స్‌లో సింగపూర్ మార్కెట్లో అందుబాటులో ఉంది.
- జాడే సియాన్
- టైటానియం బ్లాక్
- టైటానియం పర్పుల్
కనెక్టివిటీ ఫీచర్లు:
- డ్యూయల్ 5G
- 4G LTE
- Wi-Fi
- బ్లూటూత్ 5.1
- OTG
- GPS
- USB టైప్-సి పోర్ట్
హానర్ X9c ధర: మలేషియా మార్కెట్లో హానర్ X9c 12GB + 256GB వేరియంట్ ధర MYR 1,499 (సుమారు రూ. 28,700) నుంచి ప్రారంభమవుతుంది. దీని 12GB + 512GB వేరియంట్ ధర MYR 1,699 (సుమారు రూ. 32,500). ఇందులో విశేషమేమంటంటే ఇది 8GB + 256GB కాన్ఫిగరేషన్‌తో కూడా గ్లోబల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అయితే కంపెనీ దీని మూడో వేరియంట్ ధరను ఇంకా వెల్లడించలేదు.
జియో, ఎయిర్‌టెల్ సంస్థలకు షాక్- దేశంలో BSNL 5G సేవలు షురూ!
మెట్రో ప్రయాణికుల కోసం సరికొత్త సర్వీస్- ఇకపై మీ జర్నీ మరింత ఈజీ..!