ETV Bharat / bharat

భార్యను చంపి.. శవాన్ని సెప్టిక్ ట్యాంక్​లో పడేసిన వ్యక్తి.. మూడేళ్లుగా తప్పించుకుంటూ.. - పశ్చిమ బెంగాల్ భార్య హత్య కేసు

భార్యను హత్య చేసి, శవాన్ని సెప్టిక్ ట్యాంకులో పడేశాడు ఓ వ్యక్తి. తనకేమీ తెలియనట్లు మూడేళ్ల పాటు గడిపాడు. చివరకు సీఐడీ అధికారుల దర్యాప్తులో నిజం కక్కేశాడు. ఈ ఘటన బంగాల్​లో జరిగింది.

west-bengal-south-24-parganas-man-killed-his-wife

author img

By

Published : Jun 24, 2023, 9:49 PM IST

బంగాల్​లోని దక్షిణ 24 పరగణాలు జిల్లాలో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి ఆమె శరీరాన్ని సెప్టిక్ ట్యాంకులో పడేశాడు. మూడేళ్ల క్రితం ఈ ఘటన జరగ్గా.. తాజాగా మృతురాలి అస్థికలను సెప్టిక్ ట్యాంకులో గుర్తించారు సీఐడీ అధికారులు. మహిళ కనిపించకుండా పోయిన కేసులో ఆమె భర్తను గతంలోనే అరెస్ట్ చేశారు పోలీసులు. అయినప్పటికీ.. ఆమె మృతి విషయం ఇన్ని రోజులూ మిస్టరీగానే మిగిలిపోయింది. సీఐడీ రంగంలోకి దిగిన తర్వాత కేసు కొలిక్కి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే..
భోంబాల్ మండల్, తుంపా మండల్ అనే దంపతులు.. కరోనా లాక్​డౌన్ సమయంలో సోనార్​పుర్​లోని మిలాన్​పల్లిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. కొద్దిరోజులకే భోంబాల్ ఆ ఇంటిని విడిచి వెళ్లిపోయాడు. అతడి బంధువు వచ్చి ఇంటి యజమానికి అద్దె బకాయి చెల్లించాడు. ఇంట్లోని సామానును మాత్రం తీసుకెళ్లలేదు. మరోవైపు, తుంపా మండల్ తండ్రి లక్ష్మణ్ మోండల్.. 2020 మార్చి నుంచి తన కుమార్తె కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించాడు. అప్పటి నుంచి పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

మొదట తుంపా భర్త భోంబాల్​పై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు... అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, తుంపాకు ఏమైందో పోలీసులు గుర్తించలేకపోయారు. భోంబాల్​కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు కనిపెట్టలేకపోయారు. దీంతో అతడు బెయిల్​పై విడుదలయ్యాడు. అయితే, తుంపా కుటుంబ సభ్యులు కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జూన్ 13న సీఐడీ విచారణకు హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం కేసును టేకోవర్ చేసిన సీఐడీ.. దర్యాప్తు మొదలుపెట్టింది. భోంబాల్​ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించింది. దీంతో నిందితుడు నిజం కక్కాడు. కుటుంబ కలహాలతో తన భార్యను తానే హతమార్చానని భోంబాల్ ఒప్పుకున్నాడు. భార్యను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంకులో పడేసినట్లు అంగీకరించాడు. తర్వాత ఆ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సీఐడీ అధికారులకు వివరించాడు.

west-bengal-south-24-parganas-man-killed-his-wife
సెప్టిక్ ట్యాంక్​లో దొరికిన ఎముకలు

నిందితుడి సమాచారం మేరకు వారు గతంలో అద్దెకు ఉన్న ఇంటికి వెళ్లారు సీఐడీ అధికారులు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఆ ఇంట్లో తనిఖీలు చేశారు. సెప్టిక్ ట్యాంక్​ను పూర్తిగా గాలించారు. చివరకు మృతురాలి ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. పెళ్లైన మహిళ ధరించే పలు ఆభరణాలు కూడా ఎముకలతో పాటు దొరికాయని అధికారులు వెల్లడించారు. దీంతో నిందితుడి బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సీఐడీ అధికారులు. ఈ ఘటనపై ఇప్పటివరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన అధికారులు.. హత్య కేసును సైతం తాజాగా నమోదు చేశారు.

సెప్టిక్ ట్యాంక్​లో దొరికిన ఆభరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.