ETV Bharat / bharat

పేరు తప్పుగా పడిందని వినూత్న నిరసన.. అధికారి ముందు కుక్కలా మొరుగుతూ.. - బంగాల్ రేషన్ కార్డు నిరసన లేటెస్ట్ న్యూస్

రేషన్ కార్డులో పేరు తప్పుపడిందని ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. జిల్లా ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ కారు ఎదుట కుక్కలా అరిచాడు. ఈ విచిత్ర సంఘటన బంగాల్​లో జరిగింది.

WB PROTEST
అధికారి వాహనం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న వ్యక్తి
author img

By

Published : Nov 20, 2022, 1:35 PM IST

అధికారి వాహనం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న వ్యక్తి

బంగాల్​కు బంకురా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రేషన్ కార్డ్​లో పలుమార్లు తన పేరు తప్పుగా పడిందన్న ఆవేదనతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. జిల్లా ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ కారు ఎదుట కుక్కలా అరుస్తూ ఆందోళన వ్యక్తం చేశాడు. బంగాల్‌లోని బంకురా జిల్లాలోని ఓ గ్రామంలో ఏర్పాటు చేసిన ‘గడప వద్దకే ప్రభుత్వం' కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది.
ఏమైందంటే?
కుక్కలా అరుస్తున్న ఆ వ్యక్తిపేరు శ్రీకాంతి కుమార్‌ దత్తా. రేషన్‌ కార్డులో మాత్రం ఇతని పేరు శ్రీకాంతి కుమార్‌ 'కుత్తా' అని తప్పుగా అచ్చయ్యింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన అతడు కుక్కలా అరుస్తూ తన పేరును మార్చాలంటూ అర్జీ పత్రాలతో అధికారి ఎదుట నిరసనకు దిగాడు. హిందీలో కుత్తా అంటే కుక్క అని అర్థం. అందుకే అతడు కుక్కలా మొరుగుతూ నిరసన చేపట్టినట్లు తెలుస్తోంది.

ఇలా అతని పేరు తప్పుగా ప్రింట్‌ అవ్వడం ఇదే మొదటిసారి కాదట. గతంలోనూ రెండుసార్లు ఇలాగే జరిగిందట. తొలిసారి శ్రీకాంతి కుమార్ దత్తా బదులు శ్రీకాంత మొండల్‌ అని రాశారట. తప్పును సరిచేయాలని జిల్లా అధికారులకు అర్జీ పెట్టుకుంటే.. శ్రీకాంతో దత్తా అని మార్చారు. గతంలో ప్రభుత్వం నిర్వహించిన గడప వద్దకే కార్యక్రమంలో సమస్యను ప్రస్తావించగా శ్రీకాంతి కుమార్‌ కుత్తా అని మార్చారని బాధితుడు వాపోయాడు. దీంతో అధికారి ఎదుట వినూత్నంగా నిరసన చేపట్టానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక, ఆ అధికారి సైతం అతడి తీరు పట్ల విసుగు చెందకుండా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సమస్యను పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.