ETV Bharat / bharat

పోరాటాలే మమత విజయానికి బాటలు - బంగాల్ సీఎం మమతా బెనర్జీ

బంగాల్​లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్​ కాంగ్రెస్ వరుసగా మూడోసారి జయకేతనం ఎగురవేసింది. బంగాల్​ ప్రజలు మమతను ఇంతగా ఆదరించడం వెనుక కారణాలేంటి? దీదీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? కాంగ్రెస్​ను వీడి టీఎంసీని స్థాపించి ఆ పార్టీని బలమైన శక్తిగా ఎలా మార్చారు?

Mamata Banerjee
మమతా బెనర్జీ
author img

By

Published : May 2, 2021, 5:55 PM IST

Updated : May 2, 2021, 6:56 PM IST

మమతా బెనర్జీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్​షా ద్వయాన్ని ఒంటి చేత్తో ఎదుర్కొని వరుసగా మూడోసారి బంగాల్​ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు దీదీ. బంగాల్​ ముద్దు బిడ్డ తానే అని మరోమారు రుజువు చేసుకున్నారు. ఎన్నికలకు ముందు కాలికి గాయమైనా.. వీల్​ ఛైర్​పైనే ప్రచారం నిర్వహించి తృణమూల్​ కాంగ్రెస్​ను విజయ తీరాలకు చేర్చారు. బంగాల్​ ప్రజలు దీదీని ఇంతగా ఆదరించడానికి, విశ్వసించడానికి కారణం.. ఆమె ప్రజల కోసం ప్రాణాలను లెక్కచేయకుండా చేసిన పోరాటాలే.

1970-80లో బంగాల్ మహిళా కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శిగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన మమత... అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 1984లో బంగాల్ జాదవ్​పుర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 1991, 1996లో కోల్​కతా దక్షిణ్​ నుంచి బరిలోకి ఎంపీగా జయకేతనం ఎగురవేశారు.

1998లో టీఎంసీ స్థాపన..

కాంగ్రెస్​ను వీడి 1998 జనవరి 1న తృణమూల్​ కాంగ్రెస్​ను స్థాపించారు మమత. 2001, 2006 బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. అయినా నిరుత్సాహానికి లోనుకాలేదు. 2011 'నందిగ్రామ్​ ఉద్యమం'తో వామపక్షాల కంచుకోట అయిన బంగాల్​ను కూల్చి.. టీఎంసీ పార్టీ జెండాను రెపరెపలాడించారు. అంతకుముందు 30 సీట్లతో ఉన్న ఆ పార్టీ ఏకంగా 184 స్థానాలకు కైవసం చేసుకుంది. ఓటింగ్ శాతాన్ని కూడా దాదాపు 39కి పెంచుకుని బంగాల్​లో తిరుగులేని శక్తిగా అవతరించింది. ఆ తర్వాత 2016 ఎన్నికల్లోనూ వరుసగా రెండోసారి విజయ ఢంకా మోగించింది. ఈసారి ఏకంగా 211 సీట్లు గెలిచింది. ఓటింగ్ శాతాన్ని దాదాపు 45కు పెంచుకుంది. ఇప్పుడు మూడోసారి విజయదుందుభి మోగించింది. బంగాల్​ అంటే టీఎంసీ అనే స్థాయికి పార్టీని మమత బలోపేతం చేశారు.

మమత ప్రస్థానం..

mamata benarjee political career
మమత ప్రస్థానం

ఇదీ చూడండి: అజేయుడు ఊమెన్ చాందీ.. 12వ సారి విజయం

Last Updated : May 2, 2021, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.