బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీతో దిల్లీలో భేటీ అయ్యారు. కరోనా టీకాలపై ప్రధానంగా చర్చించినట్లు దీదీ తెలిపారు. జనాభా దామాషా ప్రకారం బంగాల్‌కు మరిన్ని టీకాలు కేటాయించాలని కోరినట్లు పేర్కొన్నారు.
కరోనా మూడో వేవ్‌కు కంటే ముందుగా వ్యాక్సిన్లను పంపిణీ చేయాలని ప్రధానికి సూచించినట్లు మమత తెలిపారు. మోదీ సానుకూలంగా స్పందించినట్లు చెప్పుకొచ్చారు.
సుమారు 30 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో పెగాసస్ వ్యవహారంపై కూడా ఇరువురు చర్చించినట్లు మమత వివరించారు. దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని దీదీ కోరినట్లు తెలిపారు.
బుధవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని బంగాల్ సీఎం కలవనున్నారు.