ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (మార్చి 13 - మార్చి 19) - వార ఫలాలు

ఈ వారం (మార్చి 13- మార్చి19) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

author img

By

Published : Mar 13, 2022, 4:36 AM IST

Weekly Horoscope: ఈ వారం (మార్చి 13- మార్చి 19) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

మేషం:

ధర్మనిష్టాపరాయణులై పనిచేయండి. ఉద్యోగంలో విశేష లాభముంటుంది. ఆశయం నెరవేరుతుంది. గౌరవం పెరుగుతుంది. బాధ్యతలను సకాలంలో పూర్తిచేస్తారు. తలపెట్టిన కార్యాలు మంచి ఫలితాన్నిస్తాయి. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. బంగారు భవిష్యత్తు గోచరిస్తుంది. చెడు ఏ మాత్రం ఊహించవద్దు. శివస్మరణ ఉత్తమం.

వృషభం:

ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా విజయమూ ఉంటుంది. అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారం కొంతవరకు అనుకూలం. ఖర్చులు తగ్గించాలి. సౌమ్య సంభాషణతో శాంతి లభిస్తుంది. వారం మధ్యలో ఆనందించే అంశముంది. లక్ష్మీస్మరణ అదృష్టాన్నిస్తుంది.

మిథునం:

అభీష్టసిద్ధి విశేషంగా ఉంటుంది. తలపెట్టిన కార్యాలు విజయవంతమవుతాయి. ఆర్థికపుష్టి లభిస్తుంది. సంతోషించే వార్త ఒకటి వింటారు. మిత్రులవల్ల లాభపడతారు. సమాజంలో కీర్తి లభిస్తుంది. బాధ్యతలను చక్కగా పూర్తిచేస్తారు. వారం మధ్యలో ఒక పనిలో విజయం వస్తుంది. కొన్ని సమస్యలు పరిష్కరిస్తారు. గణపతిని స్మరించండి, మనోబలం పెరుగుతుంది.

కర్కాటకం:

ధర్మమార్గంలో ముందుకు సాగండి. అనేక విఘ్నాలు ఎదురవుతాయి. సమర్థంగా అధిగమించాలి. ప్రసన్నచిత్తంతో ఆలోచిస్తే ఉద్యోగంలో ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారపరంగా శ్రద్ధ పెంచాలి. కొత్త విషయాలపై దృష్టి పెట్టండి. కోరుకున్న మార్గంలోనే అభివృద్ధి లభిస్తుంది. పదిమందికీ ఆదర్శవంతులవుతారు. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.

సింహం:

ఉన్నతమైన ఆశయాలతో పనిచేయండి, అదృష్టవంతులవుతారు. మంచి భవిష్యత్తు లభిస్తుంది. విశేష గౌరవాలున్నాయి. అభీష్టం ఫలిస్తుంది. సత్యమార్గంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీవల్ల కొందరు లాభపడతారు. సంతోషించే అంశాలున్నాయి. శాంతి పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. రవిధ్యానం శుభాన్నిస్తుంది.

కన్య:

ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అద్భుతమైన విజయం లభిస్తుంది. ఉద్యోగంలో మేలైన ఫలితాలు వస్తాయి. కోరుకున్న జీవితం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలున్నాయి. వారం మధ్యలో శుభపరిణామాలు ఉన్నాయి. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. వారాంతంలో అభీష్టసిద్ధి ఉంటుంది. ఈశ్వర ధ్యానం శుభప్రదం.

తుల:

ఆత్మవిశ్వాసం లక్ష్యాన్ని చేరుస్తుంది. ఉద్యోగంలో అనుకున్నది సిద్ధిస్తుంది. సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవాలి. మొహమాటం ఇబ్బంది పెడుతుంది. స్వయంకృషితో అభివృద్ధి సాధించే అవకాశముంది. వ్యాపార లాభముంటుంది. వారం మధ్యలో ఒక సమస్య ఎదురవుతుంది. పెద్దల సహాయంతో దాన్ని పరిష్కరించాలి. ఇష్టదేవతారాధన మంచిది.

వృశ్చికం:

సంకల్పం సిద్ధిస్తుంది. వ్యాపారబలం పెరుగుతుంది. ఆర్థిక లాభాలున్నాయి. గృహ భూ వాహనాది యోగాలుంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. ఎదురుచూస్తున్న పని పూర్తి అవుతుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలరు. అదృష్టయోగం ఉంది. ఇష్టదైవాన్ని సదా స్మరించండి, శుభం జరుగుతుంది.

ధనుస్సు:

రాజయోగ సమానమైన ఫలాలు అందుతాయి. ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. నూతన అవకాశాలు సఫలమవుతాయి. లక్ష్యం సిద్ధిస్తుంది. బాధ్యతలను సమర్థంగా పూర్తిచేస్తారు. మిత్రబలం ఆనందాన్నిస్తుంది. ఎదురుచూస్తున్న పనిలో విజయం సాధిస్తారు. వివాదాలకు అవకాశమివ్వవద్దు. గురుశ్లోకం చదవండి, శుభవార్త వింటారు.

మకరం:

దైవబలం ముందుకు నడిపిస్తుంది. ముఖ్య కార్యాల్లో విజయముంటుంది. పదవీ లాభాలున్నాయి. కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం సూచితం. అదృష్టఫలాలు అందుతాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. అధికారుల వల్ల మేలు చేకూరుతుంది. కాలాన్ని మంచి పనులకై వినియోగించండి. ఇష్ట దైవస్మరణ ఉత్తమం.

కుంభం:

ఆత్మవిశ్వాసంతో ప్రతి పనీ మనసుపెట్టి చేయాలి. విఘ్నాలున్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పొరపాట్లు జరగనీయకండి. ఆర్థిక నష్టం సూచితం. శత్రుదోషముంది. మితంగా సంభాషించాలి. మొహమాటం ఇబ్బందిపెట్టకుండా చూసుకోవాలి. కుటుంబసభ్యుల సలహాలు అవసరం. వారాంతంలో శుభం జరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.

మీనం:

అభీష్ట కార్యసిద్ధి ఉంటుంది. సందర్భానుసారం నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. అపోహలు తొలగుతాయి. సన్నిహితుల ఆదరణ లభిస్తుంది. గృహలాభం ఉంది. స్థిరాస్తి పెరుగుతుంది. కొన్ని సమస్యలు తొలగుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వ్యయం పెరగకుండా జాగ్రత్తపడాలి. దుర్గామాతను స్మరించండి, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.