Weekly Horoscope: ఈ వారం (జనవరి 02 - జనవరి 08) మీ రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి చెప్పిన సంగతులు..
ఉత్తమ భవిష్యత్తు గోచరిస్తోంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. పదిమందికీ ఆదర్శంగా నిలుస్తారు. ఆర్థికస్థితి మెరుగవుతుంది. వ్యాపారలాభముంటుంది. ముఖ్యకార్యాల్లో స్పష్టత వస్తుంది. వృథా వ్యయాన్ని నియంత్రించండి. నూతన కార్యాలకు అనుకూలమైన సమయం. ఆశయం నెరవేరుతుంది. శుభం జరుగుతుంది. ఇష్టదైవారాధన శ్రేష్ఠం.
ఆర్థికంగా అనుకూల సమయం. ముఖ్యకార్యాల్లో ఏకాగ్రత పెంచాలి. తెలియని అవరోధాలున్నాయి. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండండి. పని పూర్తయ్యేవరకూ ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆత్మవిశ్వాసంతో తట్టుకుని లక్ష్యాన్ని చేరాలి. బంధుమిత్రుల సహకారం తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపారాల్లో ముందు జాగ్రత్త అవసరం. శివారాధన మంచిది.
ఆశయాలు నెరవేరతాయి. సకాలంలో పని ప్రారంభిస్తే సత్వర విజయముంటుంది. ప్రతిష్ఠ పెరుగుతుంది. ప్రోత్సహించేవారున్నారు. పదవీయోగముంది. ప్రతిభతో లక్ష్యాన్ని చేరండి. తిరుగులేని ఫలితాలు ఉన్నాయి. దేనికీ సందేహించవద్దు. కుటుంబం గురించి ఆలోచించండి. అపోహలు తొలగుతాయి. సూర్యస్తుతితో శాంతి లభిస్తుంది.
ఉద్యోగంలో సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటుంది. ఇప్పుడు ప్రారంభించే పనులు గొప్ప లాభాన్నిస్తాయి. వ్యాపారపరంగా నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. విసుగు చెందకుండా ఓర్పుతో వ్యవహరించాలి. అవాంతరాలను తెలివిగా అధిగమించాలి. సొంత నిర్ణయం కలిసివస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజిస్తే మంచిది.
అదృష్టయోగముంది. తగినంత మానవ ప్రయత్నం చేయాలి. ఉద్యోగపరంగా బాగుంటుంది. విఘ్నాలను తేలికగా అధిగమిస్తారు. వ్యాపారబలం అద్భుతంగా ఉంది. ధనలాభముంటుంది. మనసులో అనుకున్నదే జరుగుతుంది. తగిన వాతావరణం ఏర్పడి సమస్యలు తొలగుతాయి. గృహ వాహనాది లాభాలున్నాయి. సూర్యనమస్కారం మంచిది.
ధైర్యంగా ఉండండి. ఉద్యోగంలో శాంతంగా ఆలోచించాలి. ఆవేశపరిచే వ్యక్తులున్నారు. తెలియని ఉపద్రవాలు ఎదురవుతాయి. శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్త. చిన్న పొరపాటైనా ఇబ్బంది పెడుతుంది. దైవానుగ్రహంతో ఒక పనిలో మేలు జరుగుతుంది. ఇంట్లో శాంతి లభిస్తుంది. సమష్టి కృషి ఫలిస్తుంది. రవి గ్రహస్తుతి మంచిది.
మనోభీష్టసిద్ధి విశేషంగా ఉంది. ఉద్యోగరీత్యా ఉత్తమఫలితాన్ని సాధిస్తారు. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. ధనధాన్యలాభాలుంటాయి. కోరుకున్న జీవితం లభిస్తుంది. అదృష్టవంతులవుతారు. కాలాన్ని సత్కార్యాలకై వినియోగించండి. శత్రుదోషం తొలగుతుంది. భూ-గృహ-వాహనాది యోగాలు ఫలిస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించండి, శాంతి లభిస్తుంది.
ధనధాన్యలాభముంటుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలున్నాయి. ఆశయం సిద్ధించేవరకూ శ్రమించాలి. ఓర్పు రక్షిస్తుంది. రుణభారం లేకుండా జాగ్రత్త పడాలి. వారం మధ్యలో ఒక పనిలో విజయముంటుంది. వ్యాపారంలో లాభముంటుంది. విఘ్నాలున్నా అంతిమంగా బంగారు భవితవ్యం గోచరిస్తోంది. సౌమ్యంగా సంభాషించండి. సూర్యస్తుతి శక్తినిస్తుంది.
మనోబలంతో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో విశేషమైన లాభముంది. పనులు త్వరగా పూర్తి అవుతాయి. వ్యాపారంలో అధిక లాభాలను ఆర్జిస్తారు. పనులను మధ్యలో ఆపవద్దు. ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లండి. శ్రేష్ఠమైన జీవితం లభిస్తుంది. సుఖసంతోషాలున్నాయి. దూరమైన వారు దగ్గరవుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. సూర్య నమస్కారం మంచిది.
కోరికలు నెరవేరతాయి. అవరోధాలు తొలగుతాయి. మనోబలంతో సరైన నిర్ణయం తీసుకోండి. దేనికీ వెనుకాడవద్దు. ధైర్యంగా ముందడుగు వేయండి. సౌమ్య సంభాషణ మేలు. వ్యాపారంలో ఏకాగ్రతను పెంచండి. కాలం అన్నివిధాలా సహకరిస్తుంది. ఉత్తమస్థితి గోచరిస్తోంది. మిత్రుల ద్వారా ఆనందం కలుగుతుంది. శివారాధన ఉత్తమ ఫలాన్నిస్తుంది.
మంచికాలం నడుస్తోంది. పదవీయోగముంది. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయం ఆశయసాధనలో మైలురాయి అవుతుంది. ఇప్పుడు చేసే పనులు సుస్థిరతనిస్తాయి. ఉన్నతస్థానం లభిస్తుంది. భవిష్యత్తుకు పునాదులు వేయండి. ఇంట్లోవారి సూచనలు మేలుచేస్తాయి. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. వేంకటేశ్వరస్వామి స్మరణ మంచిది.
ఉత్తమ కాలం నడుస్తోంది. బ్రహ్మాండమైన విజయం సొంతమవుతుంది. స్వల్ప ప్రయత్నంతోనే అద్భుతాలు సాధించవచ్చు. ఎదురుచూస్తున్న పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగపరంగా కలిసివస్తుంది. కోరుకున్న ఫలితం సాక్షాత్కరిస్తుంది. వ్యాపారంలో తగిన లాభం ఉంది. పనిలో సంతృప్తి లభిస్తుంది. ఇష్ట దైవస్మరణతో మనశ్శాంతి చేకూరుతుంది.