ETV Bharat / bharat

'సరిహద్దు సమస్యను సమర్థంగా ఎదుర్కొన్నాం' - ఈటీవీ భారత్​

చైనాతో తలెత్తిన సరిహద్దు సవాళ్లను.. భారత దేశం దృఢనిశ్చయంతో, సమర్థంగా ఎదుర్కొన్నట్టు విదేశాంగమంత్రి జైశంకర్​ వెల్లడించారు. పుణె ఇంటర్నేషనల్​ సెంటర్​ ఏర్పాటు చేసిన 'ఆసియా ఎకనామిక్​ డైలాగ్​' ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

We were resolute, strong about protecting our interests: Jaishankar on border issue
'సరిహద్దు సమస్యను సమర్థంగా ఎదుర్కొన్నాం'
author img

By

Published : Feb 26, 2021, 4:25 PM IST

సరిహద్దు సమస్యలను భారతదేశం.. శక్తిమంతంగా, దృఢనిశ్చయంతో సమర్థంగా ఎదుర్కొన్నట్టు విదేశాంగమంత్రి జైశంకర్​ తెలిపారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పుణె ఇంటర్నేషనల్​ సెంటర్​ ఏర్పాటు చేసిన 'ఆసియా ఎకనామిక్​ డైలాగ్​' ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు జైశంకర్​. కరోనా సంక్షోభాన్ని కూడా సమర్థంగా ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. అందరి వాదనలను పరిగణనలోకి తీసుకుని.. కరోనా సంక్షోభం వల్ల డీలా పడిన ఆర్థిక వ్యవస్థకు తనదైన శైలిలో కేంద్రం ఊతమందించిందని పేర్కొన్నారు.

"గతేడాది మూడు పెద్ద మార్పులు దేశంపై ప్రభావం చూపాయి. ప్రపంచాన్నీ ప్రభావితం చేశాయి. మొదటిది కొవిడ్​, రెండోది సంక్షోభంలో ఆర్థిక పరిస్థితి, మూడు సరిహద్దులో సవాళ్లు. ప్రతి విషయంలోనూ ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఎన్నో చర్చలు జరిగాయి. ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. ప్రభుత్వం బాధ్యతగా మేం అందరి మాటలు విన్నాము. ఆ తర్వాతే.. దేశానికి ఏది మంచిదో అదే చేశాం."

--- జైశంకర్​, విదేశాంగమంత్రి.

'రిసైలెంట్​ గ్లోబల్​ గ్రోత్​ ఇన్​ ఎ పోస్ట్​-పాండెమిక్​ వరల్డ్​' సెషన్​లో ఈ వ్యాఖ్యలు చేశారు జైశంకర్​. దేశాన్ని నడపించడమే కాకుండా.. ప్రపంచానికి సహాయం చేయడంలో తన వంతు పాత్ర పోషించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు.

ఇందులో ఆస్ట్రేలియా విదేశాంగమంత్రి మారిస్​ పేన్​ కూడా పాల్గొన్నారు.

ఇదీ చూడండి:- 'ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.