ETV Bharat / bharat

రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపిన దిల్లీ సీఎం - farmers protest delhi

డిసెంబర్ 8న రైతులు తలపెట్టిన భారత్​ బంద్​కు ఆమ్​ఆద్మీ పార్టీ మద్దతిస్తుందని తెలిపారు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. సింఘు సరిహద్దులో ఆందోళనలు చేసిన రైతులను కలిసి, అక్కడి ప్రభుత్వ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఈ మేరకు ప్రకటన చేశారు. రైతులు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవని, కష్టకాలంలో ఉన్న వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.

We support all demands of farmers: kejriwal
రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపిన దిల్లీ సీఎం
author img

By

Published : Dec 7, 2020, 11:16 AM IST

Updated : Dec 7, 2020, 11:30 AM IST

సింఘు సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​. రైతులు చేస్తున్న డిమాండ్లు సమ్మతమైనవని చెప్పారు. డిసెంబర్ 8న రైతులు తలపెట్టిన భారత్​ బంద్​కు ఆమ్​ఆద్మీపార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. బంద్​ విజయవంతం చేయాలని ఆప్​ కార్యకర్తలకు సూచించారు.

సింఘు సరిహద్దులోని గుర్​ తేగ్​ బహదూల్​ స్మారకం వద్దకు వెళ్లి నిరసన చేస్తున్న రైతులను కలిశారు కేజ్రీవాల్​. ప్రభుత్వం వారి కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. దిల్లీ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆప్​ నాయకులు, కార్యకర్తలు రైతులకు సేవకులుగా సేవలందిస్తున్నట్లు చెప్పారు. తాను కూడా సేవకుడిగానే సీఎం హోదాలో రైతుల వద్దకు వచ్చినట్లు పేర్కొన్నారు. కష్టకాలంలో ఉన్న అన్నదాతలకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. రైతులకు తాము మొదటి నుంచి మద్దతుగానే ఉన్నట్లు తెలిపారు కేజ్రీవాల్​. దిల్లీలోని 9 స్టేడియాలను తాత్కాలిక జైళ్లుగా మార్చాలని కేంద్రం ఒత్తిడి చేసినప్పటికీ తాను ఒప్పుకోలేదని గుర్తు చేశారు.

Last Updated : Dec 7, 2020, 11:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.