ETV Bharat / bharat

'దేశాన్ని ఫణంగా పెట్టి టీకాలు ఎగుమతి చేయలేదు' - సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా

భారత్‌లో వ్యాక్సినేషన్‌పై సీరం సంస్థ కీలక ప్రకటన చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశాల్లో భారత్‌ ఒకటని.. అందువల్ల వ్యాక్సినేషన్​ ప్రక్రియ పూర్తవ్వడానికి సమయం పడుతుందని వివరించింది. దేశ ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టి టీకాలు ఎగుమతి చేయలేదని స్పష్టం చేసింది.

Poonawalla
పూనావాలా
author img

By

Published : May 18, 2021, 8:02 PM IST

Updated : May 18, 2021, 10:21 PM IST

భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై సీరం సంస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ సంస్థ స్పందించింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశాల్లో భారత్‌ ఒకటని.. అందువల్ల టీకా పంపిణీ​ ప్రక్రియ పూర్తవ్వడానికి సమయం పడుతుందని వివరించింది. అయితే దేశ ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టి టీకాలు ఎగుమతి చేయలేదని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా స్పష్టం చేశారు.

దేశంలో వ్యాక్సినేషన్‌కు సహకరించేందుకు పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు తెలిపిన సంస్థ.. ఇప్పటికే 20 కోట్ల టీకా డోసులు సరఫరా చేసినట్లు స్పష్టం చేసింది. భారత్‌ వంటి దేశంలో 2-3 నెలల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయలేమని.. టీకాల పంపిణీలో అనేక సవాళ్లు ఉన్నాయని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేందుకు 2-3 ఏళ్లు పడుతుందని అభిప్రాయపడింది.

"అమెరికా కంపెనీల కంటే మాకు 2 నెలలు ఆలస్యంగా అనుమతులు వచ్చాయి. ఉత్పత్తిపరంగా ప్రపంచంలోనే మేం మూడో స్థానంలో ఉన్నాం. ఈ ఏడాది చివరి నాటికి విదేశాలకు టీకాలు సరఫరా చేస్తాం. కరోనాపై యుద్ధానికి అంతా కలిసికట్టుగా పోరాడాలి."

-అదర్ పూనావాలా

'మాటనిలబెట్టుకోవాలి..'

అంతకుముందు.. ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులతో భారత్​లో వ్యాక్సిన్లకు డిమాండ్ పెరిగిందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ అభిప్రాయపడ్డారు. దీంతో అంతర్జాతీయంగా కొరత ఏర్పడుతోందని పేర్కొన్నారు. మహమ్మారి వ్యాప్తి తగ్గిన అనంతరం.. అంతర్జాతీయ టీకా పంపిణీ కార్యక్రమం 'కొవాక్స్'కు టీకాల సరఫరా అంశంపై సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో పూనావాలా చేసిన వ్యాఖ్యాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇవీ చదవండి: టీకా భారమంతా నా భుజాలపైనే: పూనావాలా

'రాత్రికి రాత్రే టీకా ఉత్పత్తిని పెంచలేం'

Last Updated : May 18, 2021, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.