ETV Bharat / bharat

భాజపా గూటి చిలుక 'ఈడీ': రౌత్​​

author img

By

Published : Dec 28, 2020, 8:45 PM IST

ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​.. భాజపా గూటి చిలుక అని వ్యాఖ్యానించారు శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​. ప్రతిపక్షాలను వేధించేందుకు కేంద్ర సంస్థలను భాజపా వాడుకుంటోందని ఆరోపించారు.

We are not afraid of notices- Sanjay Raut
భాజపా గూటి చిలుక ఈడీ:సంజయ్​

ప్రతిపక్షాలను వేధింపులకు గురిచేసేందుకు కేంద్ర సంస్థలను భాజపా తన అస్త్రాలుగా మలుచుకుంటోందని ఆరోపించారు శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​. భాజపా గూటి చిలుకగా ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) మారిపోయిందని అన్నారు. తన భార్య వర్షా రౌత్​కు ఈడీ​ సమన్లు పంపిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మా ప్రభత్వం భయపడదు. ఈడీ మాకు పెద్ద విషయమే కాదు. ఈడీ చేస్తున్న ప్రతి చర్య రాజకీయ పూరితమే అని ప్రజలు ఎప్పుడో గ్రహించారు. నా భార్య పదేళ్ల క్రితం ఓ ఇల్లు కొందామని రూ.50 లక్షల అప్పు తీసుకుంది. ఇన్నాళ్లకు ఈడీ ఈ విషయంపై ప్రశ్నిచేందుకు మేల్కొంది. కానీ మేము ఎప్పటికప్పుడు ఈడీకి పత్రాలు అందజేశాము. "

-- సంజయ్​ రౌత్​, శివసేన సీనియర్​ నేత

నీరవ్​ మోదీ, విజయ్​ మాల్యాలను భాజపా వెనకేసుకువస్తుందని సంజయ్​ రౌత్​ విమర్శించారు. భాజపా ఖాతాలో చేరిన విరాళాలపై దర్యాప్తు జరపాలని అడిగారు. తాను చెప్పిన 120 మంది భాజపా నేతలపై ఈడీ చర్యలు తీసుకోవాలని అన్నారు. సంవత్సర కాలంలో భాజపా సంపద రూ.1600 కోట్లు ఎలా పెరిగిందో చెప్పాలని ప్రశ్నించారు.

ఇదీ చూడండి:సంజయ్​ రౌత్ భార్యకు ఈడీ సమన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.