ETV Bharat / bharat

లంచం స్వచ్ఛందంగా ఇస్తే ఓకే.. కానీ డిమాండ్ చేయొద్దు: ఎమ్మెల్యే

ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ప్రజలు స్వచ్ఛందంగా లంచం ఇస్తే అధికారులు తీసుకోవచ్చని, కానీ కచ్చితంగా ఇంత కావాలని డిమాండ్ చేయొద్దని ఆమె అన్నారు. లంచం చిటికెడు ఉప్పు పరిమాణంలో ఉంటే అభ్యంతరం లేదని, కానీ మొత్తం భోజనం లాక్కునేలా ఉండొద్దని అధికారులకు హితవు పలికారు.

'లంచం స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోవచ్చు- కానీ డిమాండ్ చేయొద్దు'
author img

By

Published : Sep 29, 2021, 7:48 PM IST

మధ్యప్రదేశ్​ బీఎస్పీ ఎమ్మెల్యే రాంబాయ్​ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తే ప్రభుత్వ అధికారులు చిన్న మొత్తంలో లంచం తీసుకోవచ్చని, కానీ ఇంత కావాలని డిమాండ్ చేయొద్దని ఆమె అన్నారు. అధికారులు తీసుకునే లంచం పిండిలో కలిపే చిటికెడు ఉప్పులా ఉంటే సమ్మతమేనని, కానీ మొత్తం భోజనాన్ని లాక్కునేలా ఉంటే ఆమోదయోగ్యం కాదని రాంబాయ్ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

రాంబాయ్ సింగ్​ మధ్యప్రదేశ్ దామోహ్ జిల్లాలోని పథరియా శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సతావా గ్రామానికి చెందిన గ్రామస్థులు కొందరు.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిధులు విడుదల చేయాలంటే లంచం కావాలని అధికారులు డిమాండ్ చేసినట్లు ఆమెకు ఫిర్యాదు చేశారు. దీంతో సమస్యను పరిష్కరించేందుకు ఆదివారం ఎమ్మెల్యే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రభుత్వ అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

నిధులు మంజూరు చేసేందుకు తమ నుంచి రూ.5,000 నుంచి రూ.9,000 వరకు పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకున్నారని ఆరుగురు గ్రామస్థులు ఆరోపించారు. సమావేశంలో ఉన్న అతడివైపు వేలెత్తి చూపించారు. దీంతో రాంబాయ్​ ఆ అధికారిని మందలించారు. ప్రజల నుంచి రూ.500, 1000 లంచం తీసుకున్నా పర్వాలేదని, కానీ వేల రూపాయలు డిమాండ్​ చేయడం సహించే విషయం కాదన్నారు. వాళ్ల డబ్బు తిరిగిచ్చేయాలని అధికారికి సూచించారు. ప్రజలు నెలకు రూ.6,000 సంపాందించేందుకు ఎంతో కష్టపడతారని, కొన్ని సార్లు పని కోసం వలస వెళ్తారని చెప్పారు. ఈ వ్యవహారం మొత్తాన్ని ఒకరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. అదికాస్తా వైరల్​గా మారింది.

కలెక్టర్ స్పందన..

అయితే ఆదివారం జరిగిన ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. గ్రామస్థుల ఆరోపణలపై విచారణ జరపాలని సంబంధిత అధికాలను ఆదేశించినట్లు చెప్పారు.

ఈ విషయంపై రాంబాయ్ మంగళవారం స్పందించారు. మధ్యప్రదేశ్​తో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని ఆమె అన్నారు. ప్రభుత్వ అధికారులు లంచం తీసుకోవడం సహజమైందని పేర్కొన్నారు. తాను ఎన్నో సార్లు ప్రజలకు డబ్బులు తిరిగి ఇప్పించానని వివరించారు. ఇలాంటి ఘటనలపై అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండదని, వాళ్లు మళ్లీ పైనున్న వారికి డబ్బులిచ్చి ఎలాంటి చర్యలు లేకుండా చూసుకుంటారని చెప్పారు. అందుకే తానే ఈ విషయాన్ని సెటిల్ చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: అమిత్​షాతో పంజాబ్​ మాజీ సీఎం అమరీందర్ సింగ్ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.