ETV Bharat / bharat

Dastagiri : వైఎస్​ వివేకా కేసు.. దస్తగిరికి భద్రత పెంపు

author img

By

Published : Apr 19, 2023, 5:31 PM IST

Updated : Apr 19, 2023, 9:01 PM IST

Approver in Viveka's murder case : వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్​గా మారిన తనకు ప్రాణహాని ఉందని దస్తగిరి తెలిపాడు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతూ కడప ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని అందించాడు. వివేకా హత్య కేసు విచారణ ఎలా జరుగుతోందో అర్థం కావడం లేదని దస్తగిరి పేర్కొన్నాడు. హత్య కేసులో పాపాన్ని కడిగేసుకోవడానికే అప్రూవర్​గా మారానని దస్తగిరి స్పష్టం చేశాడు.

వివేకానంద రెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరి
వివేకానంద రెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరి

Approver in Viveka's murder case : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి వల్ల ప్రాణహాని ఉందని భావిస్తున్నానని వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్​గా మారిన దస్తగిరి పేర్కొన్నారు. తాను సునీత వద్ద డబ్బులు తీసుకున్నట్లు వైయస్ అవినాష్ రెడ్డి పదేపదే ఆరోపిస్తున్నారని.. తాను డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే జైలు శిక్షకైనా వెనకాడబోనని స్పష్టం చేశారు. ఒకవేళ డబ్బు తీసుకోలేదని తెలిస్తే.. వారు పదవికి రాజీనామా చేసి జైలుకు వెళ్తారా అని దస్తగిరి ప్రశ్నించారు.

రక్షణ పెంచాలని కోరుతూ.. తనకు ప్రాణహాని ఉన్నందున భద్రత సిబ్బందిని పెంచాలని కోరుతూ కడప ఎస్పీ కార్యాలయానికి వచ్చానని తెలిపారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో అక్కడున్న సిబ్బందికి వినతి పత్రం అందజేశానని వెల్లడించారు. తనకు ప్రాణహాని ఉన్నట్లు సీబీఐ ఎస్పీ, కడప ఎస్పీ, రాయలసీమ రేంజ్ డీఐజీకి రిజిస్టర్ పోస్టు ద్వారా వినతులు అందజేస్తానని చెప్పారు. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఎలా జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది అని పేర్కొన్నారు.

ఆరోపణలు అవాస్తవం.. తాను వివేకా కుమార్తె సునీతమ్మ నుంచి డబ్బులు తీసుకున్నామన్న ఆరోపణలను దస్తగిరి తీవ్రంగా ఖండించాడు. సోమవారం వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్లలో మీడియా సమావేశం నిర్వహించిన దస్తగిరి.. తాను ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే జీవితాంతం జైళ్లో ఉండేందుకు సిద్ధమని సవాల్‌ విసిరారు. వివేకా కేసులో అవినాష్‌రెడ్డి పాత్ర ఉన్నదని.. అందుకే సీబీఐ అధికారులు విచారణకు పిలుస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి నుంచి తన ప్రాణాలకు ప్రమాదం ఉందని దస్తగిరి ఆరోపించాడు. తాను అప్రూవర్‌గా మారే వేళ అవినాష్ లాంటి వాళ్లు ఎందుకు ప్రశ్నించలేదని దస్తగిరి అన్నాడు. మీ వరకు రానంతవరకు మంచోడిని.. ఇప్పుడు చెడ్డవాడినా? అని ప్రశ్నించాడు.

పాప ప్రక్షాళన కోసమే.. డబ్బుకు ఆశపడి ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు చేశామని.. ఇప్పుడు డబ్బు అవసరం లేదు కనుకే సీబీఐకి నిజం చెప్పేశా అని తెలిపాడు. వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఎస్పీ రామ్​సింగ్​ను కూడా పలుకుబడి ఉందని విచారణ నుంచి తప్పించారని ఆరోపించిన దస్తగిరి... రామ్‌సింగ్‌ను మార్చితే కొత్త బృందం కొత్త కోణంలో విచారిస్తుందా? అని ప్రశ్నించాడు. వివేకా హత్య కేసులో ఎవరి పాత్ర ఏమిటో తెలుసు కాబట్టే... ఎవరైనా అలాగే దర్యాప్తు చేస్తారని అన్నారు. హత్య చేయడానికి సాయం చేసి తప్పు చేశాను కాబట్టి.. ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు అప్రూవర్​గా మారానని చెప్పాడు.

సునీతమ్మ వద్ద డబ్బులు తీసుకున్నట్లు వైయస్ అవినాష్ రెడ్డి పదేపదే ఆరోపిస్తున్నారు. నేను డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే జైలు శిక్షకైనా వెనకాడబోను..ఒకవేళ డబ్బు తీసుకోలేదని తెలిస్తే.. వారు పదవికి రాజీనామా చేసి జైలుకు వెళ్తారా..? -దస్తగిరి

భద్రత పెంపు: వివేకా హత్య కేసులో అప్రూవర్‌ దస్తగిరికి భద్రత పెంచారు. ప్రాణహాని దృష్ట్యా భద్రత కల్పించాలని ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు చేసిన వెంటనే భద్రతా ఏర్పాట్లు పోలీసులు చేపట్టారు. 4+1 చొప్పున 24 గంటలూ తుపాకులతో దస్తగిరి ఇంటి వద్ద పోలీసులు పహారా కాయనున్నారు. ఈ సాయంత్రం 5 గంటల నుంచి పోలీసులు భద్రత విధుల్లో చేరారు. ఇప్పటికే దస్తగిరికి ఒక గన్​మెన్​ను ఇవ్వగా.. ఇప్పుడు ఐదుగురిని కేటాయించారు. దీంతో దస్తగిరి భద్రతలో మొత్తం ఆరుగురు పోలీసులున్నారు.

దస్తగిరికి భద్రత పెంపు
దస్తగిరికి భద్రత పెంపు

ఇవీ చదవండి :

Last Updated : Apr 19, 2023, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.