ETV Bharat / bharat

విమానాన్ని ఢీకొట్టిన ట్రక్కు.. ఫ్లైట్​లో 140 మంది ప్రయాణికులు.. లక్కీగా.. - విమానాన్ని ఢీకొట్టిన ట్రక్కు

Vistara Flight Accident At Mumbai Airport : విస్తారా ఎయిర్​లైన్స్​కు చెందిన ఓ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. సరకులు తీసుకెళ్లే ట్రక్కు.. విమానం ఇంజిన్ ఢీకొట్టింది. ఆ సమయంలో విమానంలో 140 మంది ఉన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

vistara flight incident
vistara flight incident
author img

By

Published : Aug 2, 2023, 7:10 AM IST

Updated : Aug 2, 2023, 12:20 PM IST

Vistara Flight Accident At Mumbai Airport : మహారాష్ట్ర ముంబయి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. ఎయిర్​ విస్తారా ఎయిర్​లైన్స్​కు చెందిన విమానాన్ని సామాన్లను తీసుకెళ్లే ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విమానం ఇంజిన్​ దెబ్బతింది. ప్రమాద సమయంలో విమానంలో 140 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే వారికెవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన మంగళవారం జరిగిందని చెప్పారు.

Vistara Flight Incident : ముంబయి నుంచి కోల్​కతాకు నడిచే విమానం ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. ఇంజిన్​కు మరమ్మతులు చేశామని వెల్లడించారు. 'ఆగస్టు 1న ముంబయి నుంచి కోల్‌కతాకు బయలుదేరిన విమానాన్ని లగేజీ తీసుకెళ్లే ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానం ఇంజిన్ దెబ్బతింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసి గమ్య స్థానాలకు తరలించాం. అదృష్టవశాత్తు ప్రయాణికులలెవరికి గాయాలు కాలేదు.' అని విస్తార్ ఎయిర్​లైన్స్​కు చెందిన ఓ ఉద్యోగి తెలిపారు.

  • A Vistara aircraft engine was hit by a tow truck during push back at Mumbai airport earlier today. The Vistara flight is ready to depart from Mumbai airport to Kolkata. All 140 passengers on board are safe. pic.twitter.com/dr6622b1CP

    — ANI (@ANI) August 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

హైడ్రాలిక్ సమస్యతో అత్యవసర ల్యాండింగ్..
ఈ ఏడాది జనవరిలో ఎయిర్ విస్తారా యూకే-781 విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దిల్లీ నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న ఈ విమానానికి హైడ్రాలిక్​ సమస్య తలెత్తింది. అప్రమత్తమైన డీజీసీఏ విమానానికి అత్యవసర పరిస్థితి ప్రకటించింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం విమానం అత్యవసరంగా ల్యాండ్ అవ్వాలని ఆదేశాలు జారీ చేయగా.. వెంటనే దిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు పైలెట్లు. విమానంలో దాదాపు 140 మంది ప్రయాణికులు ఉన్నట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. విమానంలోని ప్రయాణికులు సురక్షితంగా దిగడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

గాల్లో ఒత్తిడి కారణంగా కుదుపులు..
Air India Turbulence : ఈ ఏడాది మేలో దిల్లీ నుంచి సిడ్నీ బయలుదేరిన ఎయిర్​ఇండియాకి చెందిన B787-800 విమానం గాల్లో ఒత్తిడి కారణంగా భారీ కుదుపులకు గురైంది. ఈ క్రమంలో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విమానాశ్రయానికి చేరుకోగానే ప్రయాణికులకు వైద్య సహాయం అందించినట్లు విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్​ (DGCA) పేర్కొంది.

Last Updated : Aug 2, 2023, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.