Visakhapatnam Rayagada Passenger Train Derailed: ఏపీలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లాలో కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద ఈ రైలు ప్రమాదం సంభవించింది. విశాఖ నుంచి రాయగడ వెళ్లే రాయగడ ప్యాసింజర్ రైలును.. పలాస నుంచి విజయనగరం వైపు వస్తున్న పలాస ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. 40మందికి పైగా గాయాలయ్యాయని అధికారులు వివరించారు.
రాయగడ ప్యాసింజర్ వెనుక బోగీని పలాస ప్యాసింజర్ ఢీకొట్టగా.. పలాస ప్యాసింజర్ ఇంజిన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 3 రైలు బోగీలు పట్టాలు తప్పగా.. ప్రమాద సమయంలో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో ఘటనాస్థలంలో అంధకారం నెలకొంది. చీకట్లో ఎక్కడ ఏం ఉందో కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఘటనాస్థలానికి రైల్వే సహాయ సిబ్బంది, పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Train Hits Platform Viral Video : బ్రేకులు ఫెయిల్.. ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన రైలు.. లక్కీగా..
ప్రమాదానికి గురైన 3 బోగీల్లో ఒక బోగీని కట్ చేసి సహాయక సిబ్బంది క్షతగాత్రులను బయటకు తీశారు. 3 బోగీల్లో క్షతగాత్రులను బయటకు తీసిన తర్వాతే రైళ్ల పునరుద్ధరణ ఉంటుందని.. రైల్వే అధికారులు అధికారులు తెలిపారు. ఘటనాస్థలానికి అంబులెన్సులు వెళ్లలేకపోవడంతో సహాయచర్యలకు ఆటంకం కలిగింది. ఈ క్రమంలో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడానికి.. సుమారు కిలోన్నరమీటర్ వరకు క్షతగాత్రులను సిబ్బంది మోసుకెళ్లారు. క్షతగాత్రులను విశాఖ, విజయనగరం ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
ప్రమాద ధాటికి ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురైనట్లు వివరించారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే ప్రమాదం సంభవించిందని అన్నారు. ప్రమాదం జరిగిన తీరును గుర్తుకు తెచ్చుకుంటే.. వెన్నులో వణుకుపుడుతోందని ప్రయాణికులు ఉద్రేకానికి లోనయ్యారు. ప్రమాద తీరు వల్ల.. ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని తోటి ప్రయాణీకులు భావిస్తున్నారు.
ఘటనాస్థలంలో భీతావహ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు బెంబేలేత్తిపోతున్నారు. ప్రమాదంపై రైల్వే హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ వివరాలు..
- హెల్ప్ లైన్లు: 0891 2746330, 0891 2744619
- హెల్ప్ లైన్లు: 81060 53051, 81060 53052, 8500041670, 8500041671
- రైల్వే హెల్ప్ లైన్లు: 83003 83004, 85005 85006
అంతేకాకుండా.. రైలు ప్రమాద బాధితుల కోసం విశాఖ కేజీహెచ్‌లో హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. బాధితుల వైద్య సహాయం కోసం కింద తెలిపిన నెంబర్లకు ఫోన్ చేయాలని జిల్లా పాలనాధికారి ఎ. మల్లిఖార్జున విజ్ఞప్తి చేశారు. ఈ నెంబర్ల ద్వారా 24 గంటలు వైద్య సేవల కోసం అందుబాటులో ఉంటాయని అధికారులు వివరించారు. అవి
- 8912558494,
- 8341483151,
- 8688321986.