కొవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల చెన్నైవాసికి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు డీసీజీఐ ఈ నిర్ణయానికి వచ్చింది. వలంటిర్కు నష్టపరిహారం ఇవ్వొద్దని తెలిపింది. మరోవైపు తమ వ్యాక్సిన్ సురక్షితమైనది, శక్తివంతమైనదని సీరం సంస్థ స్పష్టం చేసింది. ఈ ఘటన వల్ల వ్యాక్సిన్ షెడ్యూల్లో మార్పు ఉండదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. డ్రగ్స్, వ్యాక్సిన్లు తయారు చేసేటప్పుడు ఇలాంటి ఘటనలు జరగటం సహజమని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డా.బలరామ్ భార్గవ అభిప్రాయపడ్డారు. దీని వల్ల వ్యాక్సిన్ ప్రయోగాలు ఆగవని స్పష్టం చేశారు.
చెన్నైకి చెందిన 40ఏళ్ల వ్యక్తికి ట్రయల్స్‌లో భాగంగా కొవిషీల్డ్ టీకా ఇచ్చారు. అనంతరం తనకు నాడీ సంబంధిత సమస్యలు తలెత్తినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సీరం సంస్థపై రూ.5కోట్ల దావా సైతం వేశారు.
ఇదీ చదవండి: సీరం టీకా వలంటీర్ ఆరోపణలపై దర్యాప్తు
ఇదీ చదవండి: 'కొవిషీల్డ్ వికటించింది.. రూ.5 కోట్లు ఇవ్వండి'
ఇదీ చదవండి: 'చెన్నై వలంటీర్ నుంచి రూ. 100కోట్లు వసూలు చేస్తాం'