పుట్టింది మొదలు అమ్మ అడుగుజాడల్లోనే నడుస్తుంటాం. ప్రతి అవసరంలోనూ అమ్మే మార్గనిర్దేశం చేస్తుంది. కొన్ని విషయాల్లో అమ్మను గుడ్డిగా అనుసరిస్తాం. అమ్మతనం అన్ని జీవుల్లోనూ ఒకే తీరు కదూ! ఇదే సందేశాన్ని ఓ సింహాన్ని అనుసరిస్తున్న దాని పిల్లలు తెలుపుతున్నాయని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో పనిచేస్తున్న సుశాంత నంద అంటున్నారు. ట్విట్టర్లో షేర్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
-
Sir, a lot to learn from animals and nature....
— R K Dhiman (@RKDhiman5) May 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sir, a lot to learn from animals and nature....
— R K Dhiman (@RKDhiman5) May 14, 2021Sir, a lot to learn from animals and nature....
— R K Dhiman (@RKDhiman5) May 14, 2021
ఈ వీడియోలో సింహాన్ని దాని పిల్లలు అనుసరిస్తున్నాయి. అమ్మను అనుసరిస్తే తప్పుడు దారుల్లో నడవబోమనే సందేశాన్ని వీడియోకు సుసాంట నంద యాడ్ చేశారు. ముద్దులొలికే ఆ పిల్లలు సింహాన్ని అనుసరించే సన్నివేశం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీంతో వారు భారీగా స్పందిస్తున్నారు. తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రకృతిలో ప్రతి జీవి నుంచి నేర్చుకోవచ్చని కామెంట్ రూపంలో చెబుతున్నారు.
ఇదీ చదవండి: 9నదులు.. 99కాలువల కలయిక.. ఆ కృత్రిమ సరస్సు