ETV Bharat / bharat

రాముడి ఊరేగింపులో హింస.. అనేక రాష్ట్రాల్లో అవాంఛిత ఘటనలు

Violence during Ram Navami: ఆదివారం దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘర్షణలు జరిగాయి. శ్రీరామనవమి నేపథ్యంలో నిర్వహించిన ఊరేగింపులలో ఈ ఘటనలు జరిగాయి. కొందరు వ్యక్తులు శ్రీరాముడి శోభాయాత్రపై రాళ్లు రువ్వారు.

Violence during Ram Navami
Violence during Ram Navami
author img

By

Published : Apr 11, 2022, 11:19 AM IST

Updated : Apr 11, 2022, 12:43 PM IST

Ram Navami Stone pelting: శ్రీరామనవమి రోజున దేశంలోని పలు ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరిగాయి. మధ్యప్రదేశ్​లోని రెండు జిల్లాల్లో హింసాత్మక పరిస్థితులు తలెత్తాయి. ఆదివారం ఖర్​గోన్ జిల్లాలో రామనవమి ఊరేగింపుపైకి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. వేరొక వర్గానికి చెందిన కొందరు.. ఊరేగింపులో పెట్టిన డీజే శబ్దాలకు అభ్యంతరం చెప్పారని.. ఇదే ఘర్షణకు దారితీసిందని స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి నగరమంతా 144 సెక్షన్ విధించారు. మూడు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఆరుగురు కానిస్టేబుళ్లు సహా 24 మంది గాయపడ్డారు. ఖర్గోన్ ఎస్పీ సిద్ధార్థ్ చౌదరికి బులెట్ గాయాలయ్యాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు.

Violence during Ram Navami fete
మంటల్లో కాలిపోతున్న బైక్

మరోవైపు, బార్వాణి జిల్లాలోని సెంధ్వా నగరంలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. రాముడి శోభాయాత్రలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఓ ప్రార్థనా స్థలాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో ఘర్షణ చెలరేగింది. పోలీసులు రంగంలోకి దిగి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం రథయాత్ర సాఫీగా సాగింది.

Violence during Ram Navami fete
..

Jharkhand Ram Navami Violence: ఝార్ఖండ్​లోని లోహర్దగా జిల్లాలోనూ శ్రీరాముడి ఊరేగింపులో ఉద్రిక్త ఘటనలు తలెత్తాయి. ఆదివారం హిరాహి-హెంద్​లాసో గ్రామంలో నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొన్న భక్తులపై కొందరు రాళ్లు రువ్వారు. అనంతరం తొక్కిసలాట జరిగింది. ఇరువర్గాలు ఘర్షణకు దిగడం వల్ల.. ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. పన్నెండుకు పైగా బైక్​లు, ఓ పికప్ వ్యాన్​కు దుండగులు నిప్పంటించారు. భోగతా గార్డెన్​లో రెండు ఇళ్లు మంటల్లో కాలిపోయాయి. జిల్లా ఎస్పీ, కలెక్టర్.. ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి.. చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు.

Violence during Ram Navami
ఝార్ఖండ్: గాయపడ్డ వ్యక్తి..
Violence during Ram Navami fete
ఝార్ఖండ్​లో హింస
Violence during Ram Navami fete
.

Gujarat Ram Navami stone pelting: గుజరాత్​లోని హిమ్మత్ నగర్, ఖాంభాత్ జిల్లాలోనూ ఉద్రిక్తతలు తలెత్తాయి. శ్రీరాముడి ఊరేగింపులో దుండగులు రాళ్లు రువ్వారు. ఐదు వాహనాలకు నిప్పంటించారు. హింసను అదుపు చేయడానికి ఏడు రౌండ్ల టియర్ గ్యాస్​ను ప్రయోగించారు. ఘటనపై విచారణ చేపట్టారు.

Violence during Ram Navami fete
గుజరాత్​లో మోహరించిన పోలీసులు
Violence during Ram Navami fete
మంటల్లో కాలిపోతున్న ఇల్లు
Violence during Ram Navami fete
.

ఆనంద్ జిల్లా ఖంభాట్ ప్రాంతంలోని రామ్​జీ ఆలయం సమీపంలో రాముడి శోభాయాత్ర ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఉద్రిక్తత ఏర్పడింది. ఊరేగింపు 500 మీటర్లు కొనసాగక ముందే కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. రోడ్డుకు సమీపంలోని ఓ మసీదు వద్ద ఘటన జరిగింది. పోలీసులు రంగంలోకి దిగేలోపే.. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి.

ఇదీ చదవండి: శ్రీరామనవమి రోజున మాంసాహారం.. జేఎన్​యూలో విద్యార్థి వర్గాల ఘర్షణ

Last Updated : Apr 11, 2022, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.