ETV Bharat / bharat

గ్రామపంచాయతీ కార్యాలయం ముందే అంత్యక్రియలు.. కారణం ఇదే! - సువర్ణవతి రిజర్వాయర్

గ్రామపంచాయతీ కార్యాలయం ముందే ఓ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు గ్రామస్థులు. కర్ణాటక చామరాజనగర్​లో ఈ ఘటన జరిగింది. కారణం ఏంటంటే?

Villagers buried dead body
పంచాయతీ కార్యాలయం ఎదుటే మృతదేహాన్ని పూడ్చిపెట్టిన గ్రామస్థులు
author img

By

Published : Sep 1, 2022, 8:04 PM IST

పంచాయతీ కార్యాలయం ఎదుటే మృతదేహాన్ని పూడ్చిపెట్టిన గ్రామస్థులు

కర్ణాటక చామరాజనగర్​లో హృదయవిదారక ఘటన జరిగింది. శ్మశానానికి వెళ్లే దారిలో కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండడం వల్ల పంచాయతీ కార్యాలయం ఎదుటే చంద్రమ్మ(48) అనే మహిళ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు గ్రామస్థులు. దీంతో అధికారులు, గ్రామస్థుల మధ్య కాసేపు గందరగోళం నెలకొంది.
జిల్లాలోని మాంపల్లి గ్రామంలోని శ్మశాన వాటికకు వెళ్లాలంటే సువర్ణవతి రిజర్వాయర్ దాటాల్సి వస్తోంది. అధిక వర్షాల వల్ల అక్కడి కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
చంద్రమ్మ అనే మహిళ గురువారం మరణించగా.. శ్మశానానికి వెళ్లేందుకు వంతెన లేకపోవడం వల్ల అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. పదేళ్లుగా జిల్లా అధికార యంత్రాంగానికి, స్థానిక ఎమ్మెల్యేలకు గ్రామస్థులు ఎంత విన్నవించినా వంతెన నిర్మించలేదు. అందుకే మృతదేహాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో అంత్యక్రియలు నిర్వహించామని స్థానికులు తెలిపారు.

ఇవీ చదవండి: పడవలో పాము.. వణికిపోయిన ప్రజలు.. నీటిలో మునిగి ఆరుగురు మృతి

చెవి నొప్పితో వెళితే చేయి కట్​.. మూడు నెలల్లో జరగాల్సిన పెళ్లి రద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.