ETV Bharat / bharat

గుజరాత్​ రాజకీయాల్లో అనూహ్య మలుపు.. తదుపరి సీఎం ఎవరు? - విజయ్​ రూపానీ రాజీనామా

గుజరాత్​ ముఖ్యమంత్రిగా విజయ్​ రూపానీ రాజీనామా చేసిన క్రమంలో తదుపరి సీఎం ఎవరనే విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటికే పార్టీ నాయకులతో సీనియర్​ నేతలు సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి.

Vijay Rupani resigns
రూపానీ రాజీనామా
author img

By

Published : Sep 11, 2021, 4:16 PM IST

Updated : Sep 11, 2021, 6:21 PM IST

శాసనసభ ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర సమయం ఉన్న వేళ.. గుజరాత్​ రాజకీయాలు శనివారం అనూహ్య మలుపు తిరిగాయి. సీఎం విజయ్​ రూపానీ.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అహ్మదాబాద్​ సర్దార్​ధామ్​ భవన్​ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్​గా పాల్గొనగా.. రూపానీ కూడా హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన కొద్దిసేపటికే రూపానీ రాజీనామా చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ క్రమంలో గుజరాత్​ తదుపరి సీఎం ఎవరు? అన్న ప్రశ్నపై చర్చలు మొదలయ్యాయి.

తదుపరి ముఖ్యమంత్రి ఎవరు?

రుపానీ రాజీనామాతో గుజరాత్​ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆ రాష్ట్ర భాజపా నేతలతో సమావేశమయ్యారు పార్టీ సీనియర్​ నాయకుడు బీఎల్​ సంతోష్​. ఈ క్రమంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. గుజరాత్​లో 2022 డిసెంబర్​లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పటేల్​ సామాజిక వర్గానికి చెందిన నేతకు.. సీఎం పదవి ఇచ్చే యోచనలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం.

కొత్త ముఖ్యమంత్రి పేరును ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం రేసులో నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. నితిన్​ పటేల్​(ఉప ముఖ్యమంత్రి), కేంద్ర మంత్రులు పురుషోత్తమ్​ రుపాలా, మాన్సుఖ్​ మాండవియా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆర్​సీ ఫల్దూలు ఈ జాబితాలో ఉన్నారు.

2016, ఆగస్టులో ఆనందిబెన్​ పటెల్​ రాజీనామా చేసిన క్రమంలో.. నితిన్​ పటేల్​ ముఖ్యమంత్రి అవుతారని ఊహాగానాలు వచ్చాయి. కానీ, చివరి నిమిషంలో విజయ్​ రూపానీని సీఎంగా ఎంపిక చేశారు. ప్రస్తుతం.. రుపానీ రాజీనామా తర్వాత పటేల్​ను సీఎం చేయాలని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు ఆయన మద్దతుదారులు.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్​ మాండవియా.. పటీదార్​ సామాజిక వర్గంలో మంచి పట్టు ఉన్న నేత. కొద్ది రోజుల క్రితం తమ సామాజిక వర్గం నుంచే తదుపరి సీఎం ఉండాలని పటీదార్​ నేతలు డిమాండ్​ చేశారు.

రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సీఆర్​ పాటిల్​.. మహారాష్ట్రకు చెందిన వారు కావటం వల్ల ఆయన సీఎం రేసులో ఉండే అవకాశం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

ముందస్తు ఎన్నికలు జరుగుతాయా?

సీఎం రాజీనామాతో ముందస్తు ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన రెండు రోజుల ముందే రూపానీ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదని, సరైన సమయానికే పోల్స్​ జరగుతాయని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ రాజీనామా

Last Updated : Sep 11, 2021, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.