ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ దువా(67) దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన కొద్ది రోజుల క్రితం ఐసీయూలో చేరినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
తన తండ్రి వినోద్ దువా ఆసుపత్రిలో కన్నుమూశారని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు ఆయన కూతురు, నటి మల్లికా దువా. తండ్రి అంత్యక్రియలను దిల్లీలోని లోధిలో ఆదివారం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది తొలినాళ్లలో కొవిడ్ బారినపడ్డారు దువా. ఆయన భార్య పద్మావతి సైతం కరోనాతో జూన్‌లో మరణించారు. బ్లాక్ అండ్ వైట్ కాలంలో దూరదర్శన్‌తో కెరీన్‌ను ప్రారంభించి, ఆ తర్వాత డిజిటల్ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు దువా.
ఇదీ చూడండి: భార్య, పిల్లలను చంపేసిన డాక్టర్- కరోనా నుంచి విముక్తి కోసమని...