రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. పేలుడు పదార్థాలు ఉన్న ఓ కారును గుర్తించారు పోలీసులు. ఈ వాహనాన్ని తొలుత ఆయన భద్రతా సిబ్బంది గుర్తించారు. ముకేశ్ నివాసం వద్దకు చేరుకున్న బాంబ్ స్క్వాడ్ బృందాలు..పేలుడు పదార్థాలను జిలెటిన్ స్టిక్స్‌గా గుర్తించాయి. ఆ వాహనానికి సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటనపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ స్పందించారు. "ముంబయిలోని ముకేశ్ అంబానీ నివాసం సమీపంలో గురువారం జిలెటిన్ స్టిక్స్ ఉన్న కారును పోలీసులు గుర్తించారు. దీనిపై ముంబయి పోలీసు క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది." అని దేశ్ముఖ్ పేర్కొన్నారు.