Vaccination in India: కరోనా మహమ్మారిపై పోరులో వ్యాక్సిన్లు శక్తిని అందించాయని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వైరస్ నుంచి ప్రజలకు రక్షణ కల్పించాయని పేర్కొన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమై ఆదివారానికి ఏడాది పూర్తయిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ టీకా పంపిణీ కోసం కృషి చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
"దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడం లేదా ఆరోగ్య కార్యకర్తలు అక్కడికి టీకాలు పంపిణీ చేయడం వంటి సందర్భాలు చూసినప్పుడు మనకు గర్వంగా ఉంటుంది. మహమ్మారిపై పోరుకు భారత్ ఎప్పుడు శాస్త్రీయ విధానాన్నే అనుసరిస్తుంది."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ప్రతీ పౌరుడికి మెరుగైన చికిత్స అందేలా మౌలికవసతులను తీర్చిదిద్దుతున్నాం అన్నారు మోదీ.
షా ప్రశంసలు
దేశంలో టీకా పంపిణీ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. సమర్థవంతమైన నాయకత్వం, నిబద్ధతతో ప్రధాని చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు.
"దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వం, ప్రజలు ఏకమై ఓ లక్ష్యంతో పనిచేస్తే సాధ్యంకానిది ఏదీ ఉండదు అని భారత్ ప్రపంచానికి మరోసారి నిరూపించింది. టీకా పంపిణీ అందుకు ఉదాహరణ. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలు, ఆరోగ్య కార్యకర్తలు, కరోనా యోధులు, పౌరులకు నా అభినందనలు."
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
"దేశ ప్రజలు అందరికీ టీకా పంపిణీ చేపట్టడం అసాధ్యం అనుకున్నాం. కానీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అది సాధ్యమైంది. వయోజనుల్లో.. 93 శాతానికిపైగా జనాభా తొలిడోసు తీసుకున్నారు. ఈ టీకా పంపిణీపై ప్రపంచ దేశాలు మనపై ప్రశంసలు కురిపించాయి."
-జేపీ నడ్డా, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 156.76 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. 18 ఏళ్లు పైబడిన వారిలో 93 శాతం మంది తొలిడోసు, 70 శాతం మంది పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నట్లు పేర్కొన్నారు.
-
#WATCH| "As a result of country's solidarity & PM Modi's commitment during #COVID19, India not only manufactured vaccines but also vaccinated large part of population in short time," tweeted Union Health Minister Dr Mansukh Madaviya
— ANI (@ANI) January 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
(Video source: Dr Mansukh Madaviya's twitter) pic.twitter.com/C3IwfvjAwy
">#WATCH| "As a result of country's solidarity & PM Modi's commitment during #COVID19, India not only manufactured vaccines but also vaccinated large part of population in short time," tweeted Union Health Minister Dr Mansukh Madaviya
— ANI (@ANI) January 16, 2022
(Video source: Dr Mansukh Madaviya's twitter) pic.twitter.com/C3IwfvjAwy#WATCH| "As a result of country's solidarity & PM Modi's commitment during #COVID19, India not only manufactured vaccines but also vaccinated large part of population in short time," tweeted Union Health Minister Dr Mansukh Madaviya
— ANI (@ANI) January 16, 2022
(Video source: Dr Mansukh Madaviya's twitter) pic.twitter.com/C3IwfvjAwy
ఇదీ చూడండి : 'సమాజ్వాదీ'కి ఎదురుదెబ్బ.. భాజపాలోకి ములాయం కోడలు!