Vaccination for Childrens: దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో.. ప్రజలెవరు భయాందోళనకు గురికావద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల పిల్లలకు టీకా అందించనున్నట్లు చెప్పారు. జనవరి 10 నుంచి ఆరోగ్య కార్యకర్తలకు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి బూస్టర్ డోసు అందిస్తామని వెల్లడించారు. జాతినుద్దేశించి శనివారం రాత్రి ఆయన ప్రసంగించారు.
"'ఒమిక్రాన్'పై ప్రజలెవరూ ఆందోళనకు గురికావద్దు. మనమంతా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. వ్యాక్సిన్ తయారీ, పంపిణీ కోసం నిరంతరం పనిచేస్తున్నాం. జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వయసు వారికి టీకా అందిస్తాం. జనవరి 10 నుంచి ఆరోగ్య కార్యకర్తలకు, వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి బూస్టర్ డోసు అందిస్తాం."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
Booster Dose Healthcare Workers: ప్రజలంతా కొవిడ్ నిబంధనలను తప్పక పాటించాలని మోదీ సూచించారు. 'ఒమిక్రాన్'ను ఎదుర్కోవడానికి వైద్య వ్యవస్థ సన్నద్ధంగా ఉందని చెప్పారు. 5 లక్షల ఆక్సిజన్ పడకలు, 18లక్షల ఐసోలేషన్ పడకలు ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలో 61శాతం మంది వయోజనులకు పూర్తిస్థాయి టీకా అందిందని చెప్పారు. 90 శాతానికి పైగా సింగిల్ డోసు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'భారత్ బయోటెక్' పిల్లల కొవిడ్ టీకాకు డీసీజీఐ అనుమతి