ETV Bharat / bharat

కేంద్రం కీలక నిర్ణయం.. వారు కూడా టీకాకు అర్హులే!

vaccination for children in india: కేంద్ర ప్రభుత్వం చిన్న పిల్లల టీకా పంపిణీకి సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2023, జనవరి 1 నాటికి 15 ఏళ్లు పూర్తి కానున్న పిల్లలందరూ టీకా పంపిణీకి అర్హులు అని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలకు విడుదల చేసింది.

vaccination for children in india
చిన్న పిల్లల టీకా పంపిణీ
author img

By

Published : Jan 28, 2022, 7:45 AM IST

vaccination for children in india: చిన్న పిల్లల కొవిడ్​ వ్యాక్సినేషన్​కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2023, జనవరి 1 నాటికి 15 సంవత్సరాలు పూర్తి కానున్న పిల్లలు కూడా 15-18 ఏళ్ల కేటగిరి కింద టీకా తీసుకునేందుకు అర్హులు అని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ రాసింది.

తాజాగా 15 నుంచి 18 ఏళ్ల వయసులో ఉన్న వారికి సంబంధించిన వ్యాక్సినేషన్​ మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం.. 2007 లేదా అంతకుముందు పుట్టిన పిల్లలందరూ వ్యాక్సిన్​ తీసుకునేందుకు అర్హులు అని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో పేర్కొంది. అంతేగాకుండా జనవరి 1, 2023 నాటికి 15 ఏళ్లు నిండబోయే వారిని కూడా అర్హులుగా పరిగణించవచ్చని స్పష్టం చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం 2005, 2006, 2007 సంవత్సరాల్లో పుట్టిన పిల్లలందరూ టీకా వేయించుకోవడానికి అర్హులు కానున్నారు.

15 నుంచి 18 ఏళ్ల వారికి టీకా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం గత డిసెంబర్​లో నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రకటించారు. దీంతో జనవరి 3న టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:మహారాష్ట్ర, కర్ణాటకలో శాంతించిన కరోనా.. కేరళలో వైరస్​ ఉద్ధృతి​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.