ETV Bharat / bharat

కొండలు, కోనలు దాటి టీకా పంపిణీ​.. చిన్నారుల కోసం వరదలనూ లెక్క చేయక.. - కొల్హాపుర్​ న్యూస్​

మహారాష్ట్ర కొల్హాపుర్​లో ఆరోగ్య కార్యకర్తల నిబద్ధతకు సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న తరుణంలో అడవుల్లో నాలుగు కిలోమీటర్లు నడిచి చిన్నారులకు వ్యాక్సిన్​లు అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

torrential rains Vaccination by health workers

author img

By

Published : Jul 14, 2022, 12:19 PM IST

అడవులు, కొండలు దాటి వ్యాక్సినేషన్​.. ఆరోగ్య సిబ్బందిపై ప్రశంసలు

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్ర కొల్హాపుర్​ అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలోనే కొందరు ఆరోగ్య కార్యకర్తలు సాహసం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. నలుగురు ఆరోగ్య కార్యకర్తలు.. చిన్నారులకు వ్యాక్సిన్​ ఇవ్వడానికి అడవుల్లో నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లారు. భారీ వర్షాలతో వరదలు వస్తున్నా.. వ్యాక్సినేషన్​కు వెళ్లి వృత్తి పట్ల వారికున్న నిబద్ధతను చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

torrential rains Vaccination by health workers
ఆరోగ్య కార్యకర్తలు

అజర తాలుకాలోని అనేక గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. ధంగర్​వాడ గ్రామానికి ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేని దుస్థితి. దీంతో వీరికి కనీస వైద్య సదుపాయాలు అందడం లేదు. వీటికి తోడు భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల ఈ టీకా పంపిణీ మరింత కష్టంగా మారింది. కానీ ఆరోగ్య కార్యకర్తలు పీఆర్ నాయక్, డీఎస్​ గౌలికర్​, రేఖా పాండురంగ, లక్ష్మీ జాదవ్.. వృత్తి పట్ల నిబద్ధతతో అడవుల్లో నాలుగు కిలోమీటర్లు నడిచి చిన్నారులకు వ్యాక్సిన్ అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అయితే, ప్రతి వర్షాకాలంలోను వైద్యాధికారులు, ప్రజలు ఇలానే ప్రయాణం చేస్తారని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ఇంట్లోనే నెమళ్ల పెంపకం.. అటవీ అధికారులు తనిఖీలు.. నిందితుడు అరెస్ట్

చిన్నారిపై సవతి తల్లి కర్కశం.. అన్నం అడిగితే సీలింగ్​కు వేలాడదీసి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.