ETV Bharat / bharat

విజయన్​పై మురళీధరన్​ ఘాటు వ్యాఖ్యలు - కేంద్ర మంత్రి మురళీధరన్

కరోనా నిబంధనలు పాటించని కేరళ సీఎం పినరయి విజయన్.. కొవిడియట్​ అని వ్యాఖ్యానించారు కేంద్ర సహాయమంత్రి మురళీధరన్​. కొవిడ్​ సోకినప్పటికీ ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆరోపించారు.

Kerala CM, V Muraleedharan, covidiot
నరయి విజయన్, కేంద్ర మంత్రి మురళీధరన్, కొవిడియోట్
author img

By

Published : Apr 16, 2021, 6:42 AM IST

కేరళ సీఎం పినరయి విజయన్​పై మండిపడ్డారు విదేశాంగ శాఖ సహాయమంత్రి వీ మురళీధరన్​. విజయన్​.. 'కొవిడియట్​' అని ఘాటుగా విమర్శించారు. ఆయనకు కొవిడ్​ సోకినప్పటికీ నిబంధనలను పాటించలేదని ఆరోపించారు.

"కొవిడియట్​ అర్థం ఏమిటో మీకు తెలుసు. కరోనా నిబంధనలు ఉల్లంఘించే ముఖ్యమంత్రికీ అదే పదం వర్తిస్తుంది. ఏప్రిల్ 4న కేరళ ముఖ్యమంత్రికి వైరస్​ సోకినట్లు కాలికట్​ వైద్య కళాశాల వైద్యులు నిర్ధరించారు. అయితే ఎలాంటి కొవిడ్​ నిబంధనలు పాటించకుండా.. ఏప్రిల్​ 6న జరిగిన ఎన్నికల్లో ఓటు వేశారు."అని మురళీధరన్​ పేర్కొన్నారు.

కొవిడ్​తో ఈ నెల 8న ఆసుపత్రిలో చేరిన విజయన్.. ఏడు రోజుల తర్వాత జరిపిన పరీక్షల్లో కరోనా నెగిటివ్​గా తేలింది. దీంతో ఆయన్ని వైద్యులు డిశ్చార్చ్​ చేశారు. అయితే కొవిడ్​ నిబంధన వివాదానికి తెరలేపింది. 'ఎవరైనా వైరస్ బారినపడితే.. వారికి 10 రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు చేయాలి. కానీ సీఎం విషయంలో ఈ ప్రోటోకాల్​ పాటించలేదు' అని ధ్వజమెత్తారు మురళీధరన్​.

ఇదీ చూడండి: బంగాల్​ భాజపా అధ్యక్షుడిపై ఈసీ ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.