స్కూటీపై వెళ్తున్న ఓ యువకుడు.. నెమలి ఢీకొని మృతి చెందాడు. కర్ణాటక ఉడుపిలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నెమలి కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఏం జరిగింది?
బెలాపు గ్రామానికి చెందిన అబ్దుల్లా(24).. పాదుబ్దిరికి బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో జాతీయ రహదారి 66పై రోడ్డు దాటేందుకు నెమలి యత్నిస్తూ.. అతడి బైక్ను ఢీకొంది. దాంతో అతని వాహనం నియంత్రణ కోల్పోయింది. స్థానికులు అబ్దుల్లాను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, అతడు అప్పటికే మృతి చెందాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పాదుబిద్రి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
గోడ కూలి ఆరుగురు మృతి
ఉత్తర్ప్రదేశ్ సీతాపుర్ జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో గోడ కూలి ఆరుగురు మృతి చెందారు. అక్కడ మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లక్ష్మణ్పుర్ గ్రామంలోని ఓ ఇంటి గోడ మంగళవారం అర్ధరాత్రి కూలింది. ఈ ఘటనలో రెండు నెలల చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. ఇంట్లోని వారంతా నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
మృతులను లల్లీదేవీ(50), శైలేంద్ర(10), శివ(8), మేహక్(2 నెలలు)గా అధికారులు గుర్తించారు. మరో ఇద్దరు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
మరో ఘటనలో...
బిలౌలీ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి.. ఇంటి గోడ కూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. శిథిలాలను తొలగించేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి: Bird flu in India: భారత్‌లో తొలి బర్డ్ ఫ్లూ మరణం
ఇదీ చూడండి: ఉగ్ర చెర నుంచి విడిపించి.. తల్లిదండ్రుల చెంతకు చేర్చి..