ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. దీనితో ఆగ్రహం చెందిన గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన బాలిక సమీప పొలాల్లో శవమై తేలిందని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపారు. బాలిక కనిపించకుండా పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని.. అయితే డ్యూటీలో ఉన్న పోలీసులు చాలా సేపటివరకు తమ ఫిర్యాదును పట్టించుకోలేదని ఆరోపించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకూ నిరాకరించారని వాపోయారు. అయితే.. ఆ తెల్లారే సమీప పొలాల్లో బాలిక శవమై కనిపించిందని మండిపడ్డారు.
ఈ వ్యవహారం గ్రామంలో తీవ్ర దుమారం రేపింది. గ్రామస్థులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపించిన గ్రామస్థులు.. పోలీసులపైకి ఇటుకలు విసిరారు. మృతదేహాన్ని పోలీసులకు అప్పగించేందుకు నిరాకరించారు. సంఘటన స్థలానికి జిల్లా మేజిస్ట్రేట్ రావాలని డిమాండ్ చేశారు.
చివరకు గ్రామస్థులతో మాట్లాడి చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుని కోసం గాలిస్తున్నామని.. త్వరలోనే అరెస్టు చేస్తామని రూరల్ ఎస్పీ శుభమ్ పటేల్ తెలిపారు.
సెప్టెంబర్‌లో యూపీలో జరిగిన ఈ తరహా ఘటనల్లో ఇది మూడోది కావడం గమనార్హం.
ఇవీ చదవండి: