ETV Bharat / bharat

100 గంటల్లో కార్మికుల వద్దకు! రంగంలోకి ఆర్మీ- వర్టికల్​ డ్రిల్లింగ్​ ప్రారంభం - how to tunnel underground

Uttarkashi Tunnel Rescue Operation : ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశిలోని సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు రెండో ప్రత్యామ్నాయం అయిన వర్టికల్‌ డ్రిల్లింగ్‌ను సట్జెజ్ జల్‌ విద్యుత్ నిగమ్‌ (SJVN) చేపట్టింది.

uttarkashi tunnel rescue operation
uttarkashi tunnel rescue operation
author img

By PTI

Published : Nov 26, 2023, 10:45 PM IST

Updated : Nov 26, 2023, 10:59 PM IST

Uttarkashi Tunnel Rescue Operation : ఉత్తరాఖండ్‌ ఉత్తర్‌కాశీలో కూలిన సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావడం అత్యంత సవాలుగా మారింది. సొరంగాన్ని తవ్వేందుకు ఉద్దేశించిన ఆగర్‌ యంత్రం విరిగిపోవడం వల్ల వారు బయటకు రావడం మరింత ఆలస్యం కానుంది. ప్రత్యామ్నాయంగా భాగంగా కొండ ఎగువ భాగం నుంచి నిట్టనిలువునా కిందకు తవ్వే ప్రక్రియను రెస్క్యూ బృందాలు ప్రారంభించాయి. వర్టికల్‌ డ్రిల్లింగ్‌ను సట్జెజ్ జల్‌ విద్యుత్ నిగమ్‌ (SJVN) చేపట్టింది. సరిహద్దు రోడ్డు రవాణా సంస్థ (BRO) సాయంతో వెర్టికల్ డ్రిల్లింగ్‌ మిషన్‌ను కొండపైకి చేర్చి డ్రిల్లింగ్‌ కొనసాగిస్తున్నారు. ఇందుకోసం సైన్యం రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే భారత సైన్యం కూడా రంగంలోకి దిగింది. ధ్వంసమైన ఆగర్‌ యంత్రాన్ని బయటకు తీయడం, నిలువునా తవ్వే పనిలో సైన్యం సాయం చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ పనుల పర్యవేక్షనకు డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నారు.

  • #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Vertical drilling underway at the site of the rescue of 41 workers. Eight metres of drilling work complete.

    (Video: SJVN) pic.twitter.com/Ybm4lc5vQs

    — ANI (@ANI) November 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • VIDEO | Uttarkashi tunnel collapse UPDATE: "As you know, the auger machine failed, and we are having a lot of technical difficulties in getting the auger out of the pipe. (However), that's going much faster this morning as plasma cutters have come. Brave men are going in there in… pic.twitter.com/mRhJJxG2lK

    — Press Trust of India (@PTI_News) November 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"సొరంగంలోకి వెళ్లేందుకు గాను కొండ ఎగువభాగం నుంచి నిట్టనిలువునా తవ్వకం ప్రారంభమైంది. మొత్తంగా 86 మీటర్ల మేర కిందికి తవ్వాలని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 20 మీటర్ల మేర పూర్తయ్యింది. అంతా సజావుగా సాగితే 100 గంటల్లోనే కూలీల వద్దకు చేరుకుంటాం. చుట్టుపక్కల తవ్వే యంత్రాలు కూడా ఈ రాత్రికి సిల్‌క్యారా చేరుకోనున్నాయి. సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు ఆరు ప్రణాళికలు అమలు చేస్తున్నాం. ఇందులో సమాంతరంగా తవ్వుకుంటూ వెళ్లడమే ఉత్తమమైంది."

--మహమూద్‌ అహ్మద్‌, ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌ ఎండీ

సొరంగంలో మళ్లీ అవాంతరం
మరోవైపు సమాంతరంగా తవ్వకంలో దాదాపు 60 మీటర్ల వరకు ప్రత్యామ్నాయ మార్గం అవసరమవుతుందని అంచనా. దీనిలో 46.9 మీటర్ల పని ఇప్పటివరకు పూర్తయింది. ఈ క్రమంలో తవ్వడానికి ఉద్దేశించిన ఆగర్‌ యంత్రం తీవ్రంగా మొరాయించింది. చివరకు మరమ్మతులు చేయలేని స్థాయిలో అది ధ్వంసమైందని నిపుణులు తేల్చారు. దీంతో శిథిలాల్లో ఇరుక్కుపోయిన ఆగర్‌ బ్లేడ్లను కత్తిరించేందుకు హైదరాబాద్‌ నుంచి తెచ్చిన.. ప్లాస్మా కట్టర్‌ను ఉపయోగిస్తున్నారు. ప్లాస్మా కట్టర్ సాయంతో శిథిలాల్లో ఇరుక్కుపోయిన ఆగర్ మిషన్‌ భాగాలను బయటకు తీసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇలా ఇప్పటికే (46.9 మీటర్ల ) వేసిన గొట్టపుమార్గం ద్వారా లోపలకు వెళ్లి కూలీలు తవ్వుకుంటూ రావాల్సి ఉంటుంది. పరిమిత స్థలంలో ఒకరి తర్వాత ఒకరిగా కొంతకొంత చొప్పున పనిచేయాల్సి ఉండటంతో దీనికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

ఆగర్ యంత్రం ధ్వంసం- రంగంలోకి హైదరాబాద్ ప్లాస్మా కటర్- క్రిస్మస్ వరకు కూలీలు లోపలే!

మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రారంభం!- సొరంగంలో చిక్కుకున్న కూలీలకు ఫోన్లు, వైఫై ఏర్పాటు!

Last Updated : Nov 26, 2023, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.