ETV Bharat / bharat

సొరంగంలోకి DRDO రోబోలు- వెంటిలేషన్​ సహా కూలీలకు ఆహారం అందజేత! - ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదం

Uttarakhand Tunnel Collapse Rescue : గత 9 రోజులుగా ఉత్తరాఖండ్‌లో కూలిన సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులకు ఆహారం అందిచడమే కాకుండా వారికి వెంటిలేషన్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకున్నారు అధికారులు. ఇందుకోసం డీఆర్​డీఓ తయారు చేసిన రెండు ప్రత్యేకమైన రోబోలను టన్నెల్​ లోపలికి పంపించారు.

Uttarakhand Tunnel Collapse Rescue
Uttarakhand Tunnel Collapse Rescue
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2023, 10:28 PM IST

Updated : Nov 20, 2023, 10:39 PM IST

Uttarakhand Tunnel Collapse Rescue : ఉత్తరాఖండ్‌లో కూలిన సొరంగంలో 9 రోజులుగా చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను కాపాడేందుకు అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూలీల భద్రత కోసం సొరంగం లోపల ఆరు అంగుళాల వెడల్పు ఉన్న పైపును ఏర్పాటు చేసినట్లు ఎన్​హెచ్​ఐడీసీఎల్​ (NHIDCL) డైరెక్టర్ అన్షు మనీశ్​ ఖల్ఖో వెల్లడించారు. అంతేకాకుండా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(DRDO) తయారు చేసిన 20, 50 కిలోల చొప్పున బరువున్న 2 రోబోలను కూడా సొరంగం లోపలికి పంపినట్లు ఆయన తెలిపారు. ఇవి లోపల ఉన్న వారికి ఆహార పదార్థాలను అందించడమే కాకుండా ప్రత్యేకంగా వెంటిలేషన్​ సౌకర్యాన్ని కూడా కల్పించనున్నాయని చెప్పారు. టన్నెల్​లో చిక్కుకున్న కార్మికులను బయటకు రప్పించేందుకు ఇరువైపులా డ్రిల్లింగ్ పనులు ప్రారంభించినట్లు తెలిపారు.

  • #WATCH | Uttarkashi Tunnel Rescue | NHIDCL director Anshu Manish Khalkho says, "A six-inch pipe has been laid at the tunnel. DRDO has sent 2 robots weighing 20 kg and 50 kg respectively. All the 41 people are safe inside..." pic.twitter.com/1M3DfEC1C0

    — ANI (@ANI) November 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • VIDEO | Uttarkashi tunnel collapse: "A six-inch pipe has been laid at the tunnel through which different food items will be sent to trapped workers and it will also facilitate better ventilation there," says NHIDCL director Anshu Manish Khalkho. pic.twitter.com/0PCKjyFvrC

    — Press Trust of India (@PTI_News) November 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మేము మా మొదటి పురోగతిని సాధించాం. ఇందుకోసం మేము గత 9 రోజులుగా శ్రమిస్తున్నాం. కార్మికుల భద్రతే మా మొదటి ప్రాధాన్యత. ఇందులో భాగంగా తాజాగా 6-అంగుళాల పైపును అమర్చి వారి బాగోగులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీని ద్వారానే వారికి ఆహారం, వైద్య సామగ్రిని అందిస్తున్నాం."

- అన్షు మనీశ్​ ఖల్ఖో, ఎన్​హెచ్​ఐడీసీఎల్​ డైరెక్టర్

'ఆహారంతో మానసికంగా ధృడమవుతారు..'
'రోబోలను లోపలికి ప్రవేశపెట్టడం అనేది మేము సాధించిన మొదటి విజయంగా భావిస్తున్నాం. ఇప్పుడు వారిని బయటకు తెచ్చేందుకు జరుగుతున్న అన్ని ప్రయత్నాలు సఫలీకృతమైతే మాకు అది రెండో విజయం. దీన్ని అమలుపరచడం చాలా కీలకమైన అంశం. పైపుల ద్వారా సొరంగంలో చిక్కుకున్నవారికి ఆహారాన్ని అందిస్తున్నాం. దీంతో వారు మానసికంగా కొంత మెరుగవుతారు. వారితో కమ్యునికేట్​ అవ్వడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం' అని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఓ అధికారి తెలిపారు.

'48 గంటల్లో సమాధానమివ్వాలి'
ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు గత 9 రోజులుగా చేపట్టిన చర్యలు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌పై 48 గంటల్లోగా సమాధానమివ్వాలని ఉత్తరాఖండ్ హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఏజెన్సీలను సోమవారం కోరింది. టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన పిల్​పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కేసు తదుపరి విచారణను నవంబరు 22కి వాయిదా వేసింది హైకోర్టు.

ఇదీ జరిగింది..
Tunnel Collapse In Uttarkashi : నవంబరు 12 న బ్రహ్మకల్‌ - యమునోత్రి జాతీయ రహదారిపై.. సిల్‌క్యారా- దండల్‌గావ్‌ మధ్య సొరంగాన్ని తవ్వుతుండగా కొండచరియలు విరిగిపడి 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. తొమ్మిది రోజుల నుంచి వారిని బయటకు తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

కూలిన 'చార్​ధామ్​' సొరంగం- శిథిలాల కింద 40 మంది కూలీలు!

'మరో రెండు రోజులు సొరంగంలోనే కూలీలు! పైపుల ద్వారా ఆక్సిజన్​, ఆహారం సరఫరా'

'సొరంగంలోని కూలీల ప్రాణాలకు ముప్పు- రెస్క్యూ ఆపరేషన్​ వేగవంతం చేయాల్సిందే!'

Last Updated : Nov 20, 2023, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.