Uttarakhand Tunnel Collapse Rescue : ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ సొరంగంలోని శిథిలాల కింద చిక్కుకున్న 40 మంది కార్మికులను రక్షించేందుకు ఐదో రోజు రెస్క్యూ ఆపరేషన్ యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది. సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అనేక గంటలుగా శ్రమిస్తున్నారు. టన్నెల్‌లో చిక్కుకున్నవారిని సురక్షితంగా బయటకు తీసుకువస్తామని అధికారులు చెబుతున్నారు.
-
#WATCH | Operation is underway at Uttarakashi's Silkyara tunnel to rescue 40 workers who are stuck inside the tunnel following a landslide pic.twitter.com/N8QltcXhww
— ANI (@ANI) November 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Operation is underway at Uttarakashi's Silkyara tunnel to rescue 40 workers who are stuck inside the tunnel following a landslide pic.twitter.com/N8QltcXhww
— ANI (@ANI) November 16, 2023#WATCH | Operation is underway at Uttarakashi's Silkyara tunnel to rescue 40 workers who are stuck inside the tunnel following a landslide pic.twitter.com/N8QltcXhww
— ANI (@ANI) November 16, 2023
"మాకు ప్రభుత్వపరంగా పూర్తి మద్ధతు లభిస్తోంది. భారీ డ్రిల్లింగ్ యంత్రాలను అమర్చి ఈ రెస్క్యూ ఆపరేషన్ను 99.99% విజయవంతంగా పూర్తిచేస్తామనే నమ్మకముంది. ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించొద్దని అందరినీ కోరుతున్నాను. టన్నెల్‌లో శిథిలాల కింద ఉన్నవారందరూ సురక్షితంగానే ఉన్నారు. వారికి ఎటువంటి వైద్య సహాయం అవసరం లేదు. అయినప్పటికీ వైద్యబృందాన్ని అందుబాటులో ఉంచాం.
- గిర్దారిలాల్, ఎన్హెచ్ఐడీసీఎల్ పీఆర్వో
దిల్లీ నుంచి భారీ డ్రిల్లింగ్ యంత్రాలు..
రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా దిల్లీ నుంచి విమానంలో భారీ డ్రిల్లింగ్ యంత్రాలు తీసుకువచ్చామని ఎన్హెచ్ఐడీసీఎల్ అధికారి తెలిపారు. డ్రిల్లింగ్ మిషన్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. మరోవైపు సొరంగంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ.. అధికారులతో సమీక్షించారు.
-
#WATCH | Uttarkashi tunnel incident | Uttarakhand Chief Minister Pushkar Singh Dhami holds a review meeting with senior officials at the State Secretariat.
— ANI (@ANI) November 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
In this meeting, the Chief Minister is reviewing the ongoing relief and rescue work to rescue 40 labourers trapped in the… pic.twitter.com/XFUumM6Ahs
">#WATCH | Uttarkashi tunnel incident | Uttarakhand Chief Minister Pushkar Singh Dhami holds a review meeting with senior officials at the State Secretariat.
— ANI (@ANI) November 16, 2023
In this meeting, the Chief Minister is reviewing the ongoing relief and rescue work to rescue 40 labourers trapped in the… pic.twitter.com/XFUumM6Ahs#WATCH | Uttarkashi tunnel incident | Uttarakhand Chief Minister Pushkar Singh Dhami holds a review meeting with senior officials at the State Secretariat.
— ANI (@ANI) November 16, 2023
In this meeting, the Chief Minister is reviewing the ongoing relief and rescue work to rescue 40 labourers trapped in the… pic.twitter.com/XFUumM6Ahs
రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయాలని డిమాండ్
రెస్క్యూ ఆపరేషన్ను మరింత వేగవంతం చేయాలని సొరంగంలో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు డిమాండ్ చేశారు. తమ సహాద్యోగుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రెస్య్యూ ఆపరేషన్ను త్వరగా పూర్తిచేసి తమ తోటి ఉద్యోగులను కాపాడాలని కోరుతూ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.
-
#WATCH | Uttarkashi tunnel accident | A protest by workers breaks out at the site of the accident where the relief and rescue operation is ongoing. #Uttarakhand pic.twitter.com/bvvXrASSTh
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Uttarkashi tunnel accident | A protest by workers breaks out at the site of the accident where the relief and rescue operation is ongoing. #Uttarakhand pic.twitter.com/bvvXrASSTh
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 15, 2023#WATCH | Uttarkashi tunnel accident | A protest by workers breaks out at the site of the accident where the relief and rescue operation is ongoing. #Uttarakhand pic.twitter.com/bvvXrASSTh
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 15, 2023
"నా కుమారుడు విజయకుమార్(20) టన్నెల్‌లో చిక్కుకున్నడు. తనతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని సూచించాను. ఈ రోజు సాయంత్రంలోగా అధికారులు బయటకు తీసుకువస్తారని హామీ ఇచ్చాను. చాలా తక్కువగా ఆహారం, నీరు సరఫరా చేస్తున్నారు"
-- ధరమ్ సింగ్, బాధితుడి తండ్రి
ఏం జరిగిందంటే?
ఆదివారం తెల్లవారుజామున.. ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయింది. ఉత్తరకాశి జిల్లాలోని బ్రహ్మకల్-యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్‌యారా, దండలగావ్ మధ్య నిర్మిస్తున్న ఈ టన్నెల్‌లో కొంతమేర కూలిపోయింది. ఘటన జరిగిన సమయంలో లోపల 40 మంది కూలీలు చిక్కుకున్నట్లు వెల్లడించారు అధికారులు. నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగంలో.. 150 మీటర్ల పొడవున కూలినట్లు వివరించారు. చార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా ఈ సొరంగం నిర్మాణం జరుగుతోంది.
కూలిన 'చార్‌ధామ్' సొరంగం- శిథిలాల కింద 40 మంది కూలీలు!
'మరో రెండు రోజులు సొరంగంలోనే కూలీలు! పైపుల ద్వారా ఆక్సిజన్, ఆహారం సరఫరా'