ఉత్తరాఖండ్ జల ప్రమాదంలోఇప్పటివరకు 53మృతదేహాలు లభ్యమయ్యాయని రాష్ట్ర విపత్తు దళం ప్రకటించింది. తపోవన్ సొరంగం సహా.. నది ఒడ్డు వెంబడి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపింది.
తపోవన్ సొరంగంతో పాటు.. రైనీ గ్రామం వద్ద ఆదివారం 12 మృతదేహాలను కనుగొన్న రెస్క్యూ బృందాలు.. సోమవారం నాటికి మరో 3 లభ్యమయ్యాయని తెలిపాయి.
తపోవన్ సొరంగంలో కార్మికులు సురక్షితంగా ఉంటారని భావించి రంధ్రం చేసిన అధికారులకు.. మృతదేహాలు లభిస్తుండటం వల్ల వారిలో నిరాశ ఎదురవుతోంది.
ఇదీ చదవండి: ఉత్తరాఖండ్ విలయంలో 51కి మృతుల సంఖ్య