ETV Bharat / bharat

ఉత్తరాఖండ్​లో భాజపా నయా చరిత్ర.. మోదీ మేజిక్ రిపీట్!

Uttarakhand election result: ఉత్తరాఖండ్​లో భాజపా చరిత్ర తిరగరాసింది. అధికార మార్పిడి ఆనవాయితీకి చెక్ పెడుతూ.. వరుసగా రెండోసారి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. ప్రజావ్యతిరేకత, సీఎంల మార్పులు వంటి ప్రతికూలతలు ఉన్నా.. ప్రజాదరణ పొందడంలో కమలదళం సఫలమైంది. అధికారంలోకి రావాలనుకొని కాంగ్రెస్ భంగపడింది.

uttarakhand election story
uttarakhand election story
author img

By

Published : Mar 10, 2022, 4:37 PM IST

Uttarakhand assembly election 2022: ఉత్తరాఖండ్​లో భాజపా చరిత్ర సృష్టించింది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ అధికారం చేతులు మారే సంప్రదాయానికి చెక్ పెడుతూ.. మెజార్టీ స్థానాలను సునాయాసంగా గెలుచుకుంది. ఫలితాలు హోరాహోరీగా ఉంటాయన్న ఎగ్జిట్ అంచనాలను తలకిందులు చేసింది. కాంగ్రెస్ అనుకున్నంతగా పోటీ ఇవ్వలేకపోయింది.

Uttarakhand election result:

ముఖ్యమంత్రుల మార్పు, ప్రజావ్యతిరేకత వంటి ప్రతికూలతలు ఉన్నా.. ప్రజాదరణ పొందడంలో కమలదళం సఫలమైంది. ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతూ వస్తున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ చరిత్రను తిరగరాసింది. రాష్ట్రంలో ప్రతికూల పవనాలు ఉన్నా.. కేంద్ర అధినాయకత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాకర్షణ శక్తి.. భాజపాను గెలిపించాయి.

సవాళ్లు ఎన్నో.. అయినా విజయం కమలానిదే..

ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ముఖ్యమంత్రుల మార్పు, అపరిష్కృతంగా ఉన్న స్థానిక సమస్యలు.. దీనికితోడు అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డ నేతలు, తొలి జాబితాలో స్థానం కోల్పోయిన ఎమ్మెల్యేలతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, అసమ్మతి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నికలకు ముందు భాజపాకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఎలక్షన్లలో ఇవి పార్టీకి ప్రతికూలంగా మారతాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ, కమలనాథులు వీటన్నింటినీ దాటుకొని విజయం సాధించారు.

BJP Uttarakhand assembly election

సీఎం మార్పులు ఉన్నా..

ఉత్తరాఖండ్​లో ఐదేళ్లలో ముగ్గురు సీఎంలను మార్చింది భాజపా. 2017లో ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత త్రివేంద్రసింగ్‌ రావత్‌ సీఎంగా నియమితులయ్యారు. పార్టీలో అసంతృప్తి నేపథ్యంలో నాలుగేళ్ల తర్వాత తీరథ్‌ సింగ్‌ రావత్‌కు పీఠాన్ని అప్పగించింది భాజపా. నాలుగు నెలల వ్యవధిలోనే కొత్త సీఎంగా పుష్కర్‌ సింగ్‌ ధామీని నియమించింది. ఇవన్నీ, భాజపాకు మైనస్ అవుతాయని విశ్లేషకులు భావించారు. అయితే, ప్రజలు వీటిని పట్టించుకోలేదు.

మోదీ మేజిక్

భాజపాకు ఎన్ని సమస్యలు ఎదురైనా ప్రధాని మోదీ ఛరిష్మా గట్టెక్కిస్తుందని రాష్ట్ర నాయకత్వం బలంగా నమ్మింది. 2014, 2017, 2019 ఎన్నికల్లో మోదీ ఇమేజ్​తో భాజపా రాష్ట్రంలో సత్తా చాటింది. ఈ నేపథ్యంలోనే తాజా ఎన్నికల్లోనూ అదే విశ్వాసంతో బరిలోకి దిగింది. ఫలితాలను పునరావృతం చేసింది. ఒంటిచేత్తో భాజపా విజయానికి కృషి చేశారు మోదీ. మరే పార్టీ ఉత్తరాఖండ్​ ప్రజలకు న్యాయం చేయదని ఆయన చెప్పిన మాటలను ప్రజలు విన్నారు. భాజపాకే ఆధిక్యం కట్టబెట్టారు.

కాంగ్రెస్​ను నమ్మని ప్రజలు..

ఇక, చరిత్ర ప్రకారం చూసుకుంటే ప్రతి ఐదేళ్లకోసారి అధికారం మారే ఆనవాయితీ ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఉంది. కాబట్టి, ఈసారి అధికారం మాదేనన్న ధీమాతో కాంగ్రెస్ ఎన్నికల బరిలో దిగింది. భాజపాకు గట్టిపోటీ ఇచ్చింది. శాయశక్తులా ప్రయత్నించినా విజయతీరాలకు చేరలేకపోయింది.

Uttarakhand assembly election Congress

కాంగ్రెస్ నాయకత్వం పటిష్ఠంగా లేకపోవడం, ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లడం వల్ల.. మరోసారి విపక్ష స్థానానికే పరిమితమైంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. రాష్ట్రంలో పలుమార్లు పర్యటించారు. ఓటర్లను ఉత్తేజితం చేసేందుకు ప్రయత్నించారు. అయితే కమలదళం హవా ముందు హస్తం ప్రభావం చూపలేకపోయింది.

ఆప్ ఊసే లేదు...

రాష్ట్రంలో కాంగ్రెస్, భాజపా మధ్యే పోటీ ఉంటుందని అందరూ భావించారు. అయితే, ఈ రెండు పార్టీలకు పోటీ ఇవ్వాలనుకొని ఆప్ రంగంలోకి దిగింది. ఫలితాల్లో మాత్రం తేలిపోయింది. ఎన్నికలకు ముందు ఆ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. విద్యావంతులు, సాధారణ పౌరులను ఆలోచింపజేసేలా హామీలిచ్చారు. అయితే, ఆమ్​ఆద్మీ పంజాబ్​లో చేసిన మేజిక్​ను ఇక్కడ చూపలేకపోయింది. ఒక్క స్థానంలోనూ ఆధిక్యం ప్రదర్శించలేకపోయింది.

ఇదీ చదవండి: పాపం కాంగ్రెస్​.. యూపీలో 'సింగిల్​ సీటు' కోసం ఆపసోపాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.