ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి జననాంగాలను కొరికి అతడు ప్రాణాలు కోల్పోయేలా చేశారు పలువురు దుండగులు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ఇదీ జరిగింది.. సిద్కుల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వేకువజామున రోడ్డు పక్కన ఓ యువకుడి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. జననాంగాలను కొరకడం వల్ల ఆ వ్యక్తి చనిపోయినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారని పోలీసులు పేర్కొన్నారు. బాధితుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: బీచ్‌లో విగతజీవిగా 18 ఏళ్ల యువతి.. అసలేం జరిగింది?