golu devta uttarakhand: దేవాలయం అనగానే పూజ అయ్యాక గంటను కొట్టడం సర్వసాధారణం. కానీ ఈ గుడి అందుకు పూర్తిగా భిన్నం. అన్ని ఆలయాల్లో గంటను కొడితే ఈ గుడిలో గంటను కడతారు. ఇదేంటి అనుకుంటున్నారా అయితే ఈ గుడి గురించి తెలుసుకోండి.
దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్.. అనేక చారిత్రక దేవాలయాలతో భక్తుల కోరికలను తీరుస్తూ ప్రత్యేకతను పొందింది. రాష్ట్రంలోని అల్మోరా చిత్తయిలో ఓ వింతైన ఆలయం ఉంది. ఇక్కడ స్టాంప్ పేపర్లో తమ కోరికలను రాసి దేవుడి ముందు కడతారు. భక్తులు కట్టిన పత్రాల్లోని కోరికలను పూజారి గోలు దేవుడికి వినిపిస్తారు. కోరికలు తీరిన భక్తులు దేవుడికి గంటలను సమర్పిస్తారు. ఇదీ ఇక్కడి సంప్రదాయం.
"మేము 2010లో తొలిసారిగా ఆలయానికి వచ్చాం. అప్పుడు మేము కోరుకున్న కోరికలు అన్నీ తీరాయి. 2018లో మరోసారి వచ్చాం. అవి కూడా తీరడం వల్ల ఇప్పుడు మరోసారి వచ్చాం. మేము ఇక్కడికి రావడం ఇది ఐదోసారి."
-యాత్రికుడు
"ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని తెలిసి వచ్చాం. ప్రత్యేకమైన ఈ గుడికి ఇజ్రాయెల్ నుంచి వచ్చిన మా అతిథులను తీసుకువచ్చా."
-వివేక్, దిల్లీ
ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు ఎంతగానో విశ్వసిస్తున్నారు. అందుకు ఇక్కడ కట్టిన గంటలే సాక్ష్యమని చెబుతున్నారు. న్యాయదేవుడిగా పిలిచే ఈ గుడికి కోర్టుల్లో న్యాయం పొందని వారు సైతం దేశ నలుమూలల నుంచి వస్తారని తెలిపారు. స్టాంప్ పేపర్‌పై రాసి కోరికలు కోరుకుంటారని భక్తులు చెప్పారు.
ఇదీ చదవండి: వీధి కుక్కకు ఇన్‌స్టా అకౌంట్.. యూనివర్సిటీలో ధూమ్‌ధామ్‌గా బర్త్‌డే వేడుకలు