ఉత్తర్‌ప్రదేశ్ బారాబంకీ జిల్లాలో(Uttar Pradesh Barabanki News) ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు, బస్సు ఢీకొన్న ఘటనలో 15 మంది మరణించారు. 20 మందికిపైగా గాయపడ్డారు. ఘటనా స్థలంలోనే 9 మంది చనిపోగా.. మరో ఆరుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
ఎలా జరిగింది?
దిల్లీ నుంచి బహ్రాయిచ్ వెళ్తున్న ఓ బస్సు బారాబంకీ జిల్లా(Uttar Pradesh Barabanki News) బాబుర్హియా గ్రామం వద్ద ఓ ఇసుక ట్రక్కును ఢీకొట్టిందని జిల్లా ఎస్పీ యమునా ప్రసాద్ తెలిపారు. బస్సు డ్రైవర్ ఎదురుగా వచ్చిన ఓ ఆవును తప్పించబోగా.. ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఆ సమయంలో బస్సులో 70మంది ఉన్నారని పేర్కొన్నారు.
క్షతగాత్రులను లఖ్‌నవూలోని ట్రామా కేంద్రానికి అధికారులు తరలించారు.
సీఎం దిగ్భ్రాంతి..
ఈ ప్రమాద ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడ్డవారికి రూ.50,000 పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు నాణ్యమైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: భారీ వర్షాలకు కూలిన ఇల్లు.. ఏడుగురు దుర్మరణం
ఇదీ చూడండి: పొరపాటున కన్నబిడ్డనే కాల్చి చంపిన తండ్రి.. ప్రాయశ్చిత్తంగా...