ETV Bharat / bharat

India Taliban Talks: 'కశ్మీర్ కోసం తాలిబన్లతో భారత్ డీల్​!' - afghan taliban

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల ప్రభుత్వం(Afghanistan latest news) ఏర్పాటైతే భారత్ వ్యతిరేక శక్తులు ఏకమయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కశ్మీర్​ మళ్లీ వేర్పాటువాద శక్తులకు నిలయంగా మారకముందే కేంద్రం తాలిబన్లతో(Afghanistan Taliban) ఒప్పందం కుదుర్చుకోవాలని సూచిస్తున్నారు. తాలిబన్లతో సంప్రదింపులు(India Taliban Talks) జరపకపోతే అఫ్గాన్ పొరుగు దేశాలైన భారత్​తో పాటు, పాక్, చైనాకు కూడా తిరుగుబాటు శక్తుల నుంచి ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.

Can India strike deal with Taliban for Kashmir?
'కశ్మీర్ కోసం తాలిబన్లతో భారత్ డీల్​!'
author img

By

Published : Sep 1, 2021, 2:33 PM IST

అఫ్గానిస్థాన్​లో(Afghan Crisis) రెండు దశాబ్దాలుగా సాగుతున్న యుద్ధానికి తెరదించి అమెరికా దళాలు ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాయి. ఫలితంగా పొరుగు దేశాలకు ఆందోళనకర పరిస్థితులు, భద్రతాపరమైన అనిశ్చితులు నెలకొన్నాయి. తాలిబన్లకు(Afghan Taliban) చైనా, పాకిస్థాన్, ఇరాన్ మద్దతుగా ఉంటాయనే విషయంలో సందేహం లేనప్పటికీ.. ఆ దేశాలు తాలిబన్లను ఇంకా అధికారికంగా గుర్తించలేదు. అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత గాలులు ఎలా వీస్తాయోనని ప్రస్తుతానికి వేచి చూసే ధోరణినే అవలంబిస్తున్నాయి. అఫ్గాన్​లో శాంతిని నెలకొల్పుతామని హామీ ఇచ్చిన తాలిబన్ల ప్రభుత్వం ఐక్యతా విధానాన్ని పాటిస్తుందా? లేదా? అని తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్నాయి.

బలగాల ఉపసంహరణ(US troops Withdraw) ప్రారంభించిన తర్వాత తమ ప్రజలను స్వదేశానికి తరలించేందుకు అమెరికా, దాని మిత్ర దేశాలు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు తాలిబన్లు మాత్రం అఫ్గాన్​ సహా రాజధాని కాబుల్​లో అంతకంతకూ తమ బలాన్ని పెంచుకుంటూ పోయారు. కాబుల్ విమానాశ్రయం వద్ద జంట పేలుళ్లు జరిగిన తర్వాత మరింత పకడ్బందీగా ఆ ప్రాంతంపై పట్టు సాధించారు.

1990లతో పోల్చితే తాలిబన్ల ప్రవర్తనలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తమకు వ్యతిరేకంగా పనిచేసే మీడియాతో ఎలా వ్యవహరించాలో వారు నేర్చుకున్నట్లు తాలిబన్ల నాయకుడి ప్రెస్ కాన్ఫరెన్స్​ను చూస్తే అర్థమవుతోంది. పాశ్చాత్య దేశాలను తమ నేల నుంచి వెళ్లగొట్టేందుకు దోహా ఒప్పందం కుదుర్చుకుని తమ చతురతనూ చాటుకున్నారు.

అమెరికా బలగాల ఉపసంహరణ తరవాత తాలిబన్ల(Taliban News) శక్తి క్రమంగా పెరిగింది. ఇది ఇతర తిరుగుబాటు గ్రూపులకు ధైర్యాన్నివ్వడమే కాకుండా, శక్తిమంతమైన దేశాలతో వారికి అనుకూల షరతులపై చర్చించేలా విశ్వాసాన్ని నింపింది. దాదాపు అఫ్గానిస్థాన్​ పొరుగు దేశాలన్నీ తిరుగుబాటు శక్తుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చైనాలో వీఘర్లు(china uyghur), ఇరాన్​లో ఐసిస్, పాకిస్థాన్​లో టీటీపీ, భారత్​లో కశ్మీర్​ వేర్పాటువాద శక్తులు ఆయా దేశాలకు పెద్ద తలనొప్పిగా మారాయి. తాలిబన్లతో ఈ దేశాలు సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ.. మరోవైపు తిరుగుబాటు శక్తులు మరింత బలపడుతాయేమోనని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

చైనాకు ఈటీఐఎం బెడద..

అఫ్గాన్​ బదఖ్షన్ ప్రావిన్సులోని తూర్పు టర్కిస్థాన్​ ఇస్లామిక్ ఉద్యమం(ఈటీఐఎం) చైనాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఫైటర్లు తాలిబన్లతో కలిసి అమెరికా సంకీర్ణ దళాలకు వ్యతిరేకంగా పోరాడారు. చైనా షిన్​జియాంగ్ ప్రావిన్సులోని వీఘర్ ముస్లింల కోసం వీరు ఉద్యమం చేస్తున్నారు. బదఖ్షన్​ ప్రావిన్సుతో షిన్​జియాంగ్ ప్రావిన్సు 95 కి.మీ సరిహద్దును పంచుకుంటోంది. దీంతో తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించకపోతే వారి మద్దతుతో ఈటీఐఎం మరింత బలపడుతుందని చైనా ఆందోళన చెందుతోంది. కాకసస్​ ఎమిరేట్స్​ ఆప్ చెచెన్​ ఫైటర్లతోనూ రష్యా ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొంటోంది.

పాక్​కు టీటీపీ తలనొప్పి...

నియంత్రణ లేని తెహ్రీక్​-ఏ-తాలిబన్​(టీటీపీ) గత దశాబ్ద కాలంగా పాకిస్థాన్​కు తలనొప్పులు తెస్తోంది. దీని వల్ల భారీ ఆర్థిక, ప్రాణ నష్టం వాటిల్లడమే గాక పాక్​లోని సాధారణ పౌరులు భద్రతపై ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. బహిరంగ ప్రదేశాలతో పాటు ప్రార్థనా స్థలాల్లోనూ బాంబు దాడులు చేసి పాక్ ప్రజలను హడలెత్తిస్తోంది టీటీపీ. అమెరికా ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అఫ్గాన్​లోని నార్తర్న్ అలయన్స్​పై తాలిబన్లు దాడి చేశారు. అయితే ఈ పోరాటంలో తాలిబన్లతో టీటీపీ కలిసి నార్తర్న్​ అలయెన్స్​ను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో టీటీపీకి తాలిబన్లు మద్దతిస్తే తమకు మరిన్ని ఇబ్బందులు తప్పవని పాక్ భావిస్తోంది.

భారత్​కు కశ్మీర్​ భద్రత ముప్పు..

తాలిబన్ల వల్ల పాక్​, చైనా కంటే భారత్​కే​ ఎక్కువ ఆందోళనకర పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదముంది. తాలిబన్లతో మనకు సాన్నిహిత్యం గానీ, దూరం గానీ లేదు. అయితే పాకిస్థాన్​ ఐఎస్​ఐ కార్యకలాపాలు సహా కీలక ఇతర తిరుగుబాటు సంస్థల నియంత్రణ పూర్తిగా వీరి చేతుల్లోనే ఉంది. కశ్మీర్​లో గానీ, కశ్మీర్ కోసం జరిగే ఉగ్ర కార్యకలాపాలకు పూర్తి మద్దతు ఉండాలని ఈ సంస్థల మధ్య దాశాబ్దాలుగా ఏకాభిప్రాయం ఉంది.

1999లో అఫ్గాన్ కాందహార్​లో ఎయిర్ ఇండియా IC 814 విమానం హైజాక్​ అయింది. ముగ్గురు కశ్మీర్ ఉగ్రవాదులను విడుదల చేయాలని ఉగ్రసంస్థలు డిమాండ్ చేసినప్పుడే వీరి మధ్య ఐకమత్యం బహిర్గతమైంది. ఆ సమయంలో అఫ్గాన్​లో తాలిబన్లే అధికారంలో ఉన్నారు. విమానంలోని పౌరులను క్షేమంగా విడిచిపెట్టాలంటే జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్​ను విడిచి పెట్టాలని అప్పుడు ఉగ్రవాదులు భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోర్చుగీస్ పాస్​పోర్టుతో భారత్​లోకి ప్రవేశించి కశ్మీర్​లో ఉగ్రవాదుల నియామకాలు చేపడుతున్నాడని మసూద్​ను 1990ల మొదట్లో పోలీసులు అరెస్టు చేశారు. విమానం హైజాక్ చేసిన ఉగ్రవాదుల డిమాండ్ మేరకు అతడిని విడిచిపెట్టారు.

మసూద్ అజార్ విడుదల.. భారత​ వ్యతిరేక ఉగ్రశక్తులు ఏకమై ప్రణాళికలు రచించేందుకు తోడ్పడింది. లష్కరే, హిజ్బుల్ ముజాహిదీన్​ సంస్థల్లా కాకుండా పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం నుంచి అజార్ కార్యకలాపాలు నిర్వహించేవాడు. అయితే కశ్మీర్​లోని అశాంతి, రాష్ట్రపతి పాలనకు ముగింపు పలుకుతూ అక్కడ ఎన్నికలు నిర్వహించింది భారత ప్రభుత్వం. ఫరూఖ్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి. ఉగ్రవాదుల డిమాండ్​కు తలొగ్గి మసూద్​ను విడిచిపెట్టొద్దని ఫరూఖ్ అబ్దుల్లా ప్రభుత్వానికి అప్పుడే సూచించారు. దీని వల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇప్పుడు మళ్లీ..

మసూద్ అజార్ ఇప్పుడు తాలిబన్ల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నాడు. అఫ్గాన్ తమ అధీనంలోకి వచ్చిందని తాలిబన్లు ప్రకటించిన వెంటనే అతడు కాందహార్ వెళ్లి నాయకులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కశ్మీర్ వేర్పాటువాద శక్తులకు సాయం చేయాలని కోరినట్లు సమాచారం. తాలిబన్లు గౌరవించే వ్యక్తుల్లో జైష్ కమాండ్​గా ఉన్న అజార్​ కూడా ఒకడు.

మారిన పరిస్థితులు..

కశ్మీర్​ పరిస్థితులు ఇప్పుడు 1990ల నాటిలా లేవు. కేంద్రం 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు చేసింది. దాన్ని వ్యతిరేకించిన వారిని అరెస్టు చేసింది. దీంతో కశ్మీర్​ ప్రాంత నాయకులంతా ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదు. గతానికి భిన్నంగా వారు వేర్పాటువాదుల భాషను గుర్తు తెచ్చేలా మాట్లాడుతున్నారు. వేర్పాటు వాదాన్ని సమర్థించే హురియత్​కు ప్రాక్సీలుగా మారిపోయారు.

ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కశ్మీర్​ ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత, యువత ఆగ్రహాలను వేర్పాటువాద శక్తులు తమకు అనుకూలంగా మార్చుకుని, మకాంను అఫ్గాన్ నుంచి కశ్మీర్​కు మార్చితే భారత్​కు భద్రతాపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదముంది. మసూద్ అజార్ వంటి వ్యక్తులు కశ్మీర్ యువతను మరోసారి ప్రభావితం చేయగలరు. కశ్మీర్​లో ఫిదాయిన్(ఆత్మాహుతి) దాడులను మొదలు పెట్టింది కూడా అజార్ స్థాపించిన జైషే ఉగ్ర సంస్థే. 2000 సంవత్సరంలో శ్రీనగర్​ యువకుడితో అక్కడి ఆర్మీ బేస్​పై మొట్టమొదటి పిదాయిన్ దాడి జరిపించింది.

కశ్మీర్ మరోసారి ఉగ్రవాద శక్తులకు నిలయంగా మారకముందే తాలిబన్లతో చర్చలు జరిపి ప్రణాళికలు రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ దిశగా భారత ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతోంది. తాలిబన్లు అప్గాన్​ను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకున్న తర్వాత తొలిసారి వారితో అధికారిక చర్చలు జరిపింది. ఖతార్​లోని భారత రాయబారి దీపక్​ మిత్తల్​, తాలిబన్​ నేత షేర్​ మహమ్మద్​ అబ్బాస్​ స్టానెక్జాయ్​.. దోహా వేదికగా మంగళవారం భేటీ అయ్యారు. భారత్​పై ఉగ్రవాద కార్యకలాపాలు సాగించేవారికి అఫ్గాన్​ మద్దతివ్వకూడదని భేటీలో మిత్తల్​ తాలిబన్లకు తేల్చిచెప్పినట్టు విదేశాంగశాఖ వెల్లడించింది. భద్రత, అఫ్గాన్​లోని భారతీయుల తరలింపుపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు పేర్కొంది. వీటిపై తాలిబన్లు సానుకూలంగా స్పందించినట్టు స్పష్టం చేసింది.

మరికొన్ని రోజుల్లో తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన చేయనున్నారు. అఫ్గాన్​ను ఆర్థికంగా ముందుకు నడిపించాలంటే ప్రపంచ దేశాల సహకారం వారికి కావాల్సిందే. ఈ క్రమంలో పొరుగు దేశాలతో పాటు అంతర్జాతీయ సంఘం మద్దతు కూడగట్టేందుకు తాలిబన్లు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా.. భారత్​తో తాము స్నేహపూర్వక సంబంధాలే కోరుకుంటున్నట్టు ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యానించారు తాలిబన్​ నేతలు.

(రచయిత: బిలాల్ భట్​, న్యూస్ ఎడిటర్- ఈటీవీ భారత్)

ఇవీ చదవండి: US Military: అఫ్గాన్​ 'అస్త్రాలను' పేల్చేసిన అగ్రరాజ్యం

Afghan news: అఫ్గాన్‌ సంపదపై డ్రాగన్‌ కన్ను.. తాలిబన్లతో మంతనాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.