ETV Bharat / bharat

'భారత్​ వేదికగా తాలిబన్లపై అమెరికా గురి'- కాంగ్రెస్​ ఫైర్​! - కాంగ్రెస్ తాజా వార్తలు

భారత​ భూభాగం నుంచి అఫ్గానిస్థాన్​లోని ఉగ్రవాదులపై వైమానిక దాడులు జరిపేందుకు దిల్లీ​ అనుమతిని తాము కోరామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్(Antoni Blinken)​ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో.. భారత ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్​ డిమాండ్​ చేసింది. అమెరికా బలగాలు అడుగుపెట్టిన ప్రతి దేశం తీరని నష్టాన్నిచవిచూసిందని చెప్పింది.

america troops in india
మనీష్​ తివారీ ట్వీట్​
author img

By

Published : Sep 15, 2021, 1:16 PM IST

తాలిబన్ల నేతృత్వంలోని అఫ్గాన్​పై(Afghanistan) వైమానిక దాడులు జరిపేందుకు భారత ప్రభుత్వాన్ని తాము అనుమతి కోరామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్(Antoni Blinken) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ మేరకు అక్కడి మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

"అఫ్గాన్​లోని కొత్త తాలిబన్ ప్రభుత్వాన్ని నిశితంగా పరిశీలించేందుకు భారత్​తో అమెరికా పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరుపుతోంది. వారిపై దాడి చేసేందుకు గల సామర్థ్యాన్ని నిరంతరం పరిశీలిస్తోంది. వాయవ్య భారత్​ అత్యంత కీలకమైన ప్రాంతం. ఎందుకంటే... కతర్​, దోహాతో పోల్చితే అఫ్గాన్​కు వాయవ్య భారత్​లోని ప్రాంతాలు చాలా తక్కువ దూరంలో ఉంటాయి. ఉగ్రవాదులకు, ముఖ్యంగా అల్​-ఖైదా వంటి వారికి తమ దేశంలో స్థావరం ఇవ్వడం ద్వారా కలిగే పరిణామాల గురించి, తాలిబన్లకు బాగా తెలుసు."

-ఆంటోని బ్లింకెన్​, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి

బ్లింకెన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్​ తివారీ(Manish Tiwari) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మీడియా కథనాలు నిజమే అయితే.. దీనిపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

manish tiwari tweet
మనీష్ తివారీ ట్వీట్​

"వాయువ్య భారత్​ నుంచి అఫ్గానిస్థాన్​పై వైమానిక దాడులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్.. భారత్​ను కోరింది నిజమేనా? ప్రధానమంత్రి కార్యాలయంపై దీనిపై సాధ్యమైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలి."

-మనీష్​ తివారీ, కాంగ్రెస్​ సీనియర్ నేత

'వినాశనమే..'

అమెరికా సైనిక కార్యకలాపాలు చేపట్టడం వల్ల ఎన్నో దేశాలు.. తీరని నష్టాన్ని చవి చూశాయని తివారీ పేర్కొన్నారు. వారిని అనుమతిస్తే భారత్​లోనూ అదే పరిస్థితి తలెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

"70 ఏళ్లలో ఏ విదేశీ బలగాలు కూడా భారత్​ను వినియోగించుకునేందుకు అనుమతించ లేదు. అలా చేస్తే.. భారత్ విధ్వంసకరంగా మారుతుంది. ఫిలిప్పీన్స్​, కొరియా, ఒకైనావా, వియత్నాం, లాటిన్​, దక్షిణ అమెరికా వంటి దేశాలు.. అమెరికా లేదా ఇతర దేశాలకు చెందిన బలగాలకు తమ దేశంలో చోటిచ్చి ఎంతో వినాశనాన్ని ఎదుర్కొన్నాయి. ఇప్పుడు అలా విదేశి బలగాలు.. భారత్​కు చేరితే భారత సార్వభౌమత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లే. దేశ ప్రయోజనాలను మొత్తం అమ్మినట్లే."

-మనీష్​ తివారీ, కాంగ్రెస్ నేత

క్వాడ్ సదస్సులో భాగంగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కలిసేందుకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24న అమెరికా వెళ్లనున్న తరుణంలో.. బ్లింకెన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇదీ చూడండి: రక్షణ శాఖ నూతన భవనాలను ప్రారంభించనున్న ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.