ETV Bharat / bharat

'చేతులు జోడించి అడుగుతున్నా.. పోలింగ్​ కుదించండి' - బంగాల్​ సీఎం మమతా బెనర్జీ వార్తలు

కొవిడ్​ విలయ తాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో.. బంగాల్​లో ఎన్నికల షెడ్యూల్​ కుదించాలని ఈసీని కోరారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తదుపరి మూడు దశల్లో నిర్వహించాల్సిన పోలింగ్​ను ఒక్కరోజులో ముగించాలని సూచించారు. మరోవైపు.. రాష్ట్రంలో కొవిడ్​ను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేసినట్టు దీదీ తెలిపారు.

Bengal CM Mamata
బంగాల్​ ముఖ్యమంత్రి మమత
author img

By

Published : Apr 19, 2021, 4:28 PM IST

బంగాల్​లో కరోనా కేసులు ఉద్ధృతమవుతున్న వేళ.. తదుపరి దశల్లో జరిగే ఎన్నికలపై పునఃపరిశీలించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్​ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల సంఘాన్ని కోరారు. మూడు దశల పోలింగ్​ను ఒకరోజులో నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. అలా కానిపక్షంలో కనీసం రెండు రోజుల్లోనైనా పూర్తి చేయాలని దినాజ్​పుర్​ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈసీని అభ్యర్థించారు దీదీ. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఈసీ తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు.

"చేతులు జోడించి ఎన్నికల సంఘాన్ని అభ్యర్థిస్తున్నా. రాష్ట్రంలో జరిగే మిగిలిన మూడు దశల పోలింగ్​ను ఒకే దఫాలో నిర్వహించండి. కుదరకపోతే కనీసం రెండు రోజులకు కుదించే ఏర్పాటు చేయండి."

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

భాజపాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవద్దంటూ ఈసీని కోరారు దీదీ. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోలింగ్​ షెడ్యూల్​ను కుదించాలని కోరారు.

ఆ రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలకు గానూ.. ఇప్పటికే ఐదు విడతల్లో 180 నియోజకవర్గాలకు పోలింగ్​ జరిగింది. మిగిలిన 114 సీట్లకు మూడు దశల్లో ఏప్రిల్ 22 నుంచి 29 వరకు ఎన్నికలు జరగనున్నాయి.

ప్రత్యేక టాస్క్​ఫోర్స్​తో..

బంగాల్​లో కరోనాను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల ర్యాలీలో పేర్కొన్నారు మమత. కొవిడ్​ పరిస్థితులపై ప్రజలు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వైరస్​ను కట్టడిచేసేందుకు రాత్రి కర్ఫ్యూ ఒక్కటే పరిష్కారం కాదన్న ఆమె.. ఆస్పత్రుల్లో కొవిడ్​ రోగుల కోసం పడకల్ని పెంచడం సహా ఇతర సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

ఇదీ చదవండి: అదనపు టీకాల కోసం మోదీకి దీదీ విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.