ETV Bharat / bharat

డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లై ఇలా.. - jobs notification

UPSC CDS 2022: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS) నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల్ని భర్తీ చేయనుంది యూపీఎస్‌సీ. ఎంపికైనవారికి ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పోస్టింగ్ ఇవ్వనుంది. దరఖాస్తుకు చివరి తేది జూన్ 7. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు మీకోసం..

UPSC CDS Job Notification
UPSC CDS Job Notification
author img

By

Published : May 31, 2022, 12:29 PM IST

UPSC CDS 2022 Job Notification: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS) పరీక్ష కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 339 పోస్టుల్ని ప్రకటించింది. హైదరాబాద్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పలు ఖాళీలున్నాయి. ఈ ఎగ్జామినేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 2022 జూన్ 7 లోగా దరఖాస్తు చేసుకోవాలి. www.upsc.gov.in వెబ్​సైట్​లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అడ్మిషన్ లభిస్తుంది. శిక్షణ తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో పోస్టింగ్ ఉంటుంది.

విద్యార్హతలు- ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అడ్మిషన్ల కోసం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. ఇండియన్ నావల్ అకాడమీలో అడ్మిషన్ల కోసం ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ కావాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో అడ్మిషన్ల కోసం బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ పాస్ కావాలి. (ఇంటర్మీడియట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ తప్పనిసరి)
ఇతర అర్హతలు- పెళ్లి కాని పురుషులు, మహిళలు మాత్రమే అప్లై చేయాలి.
వయస్సు- ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ కోసం అప్లై చేసే అభ్యర్థులు 1999 జూలై 2 నుంచి 2004 జూలై 1 మధ్య జన్మించినవారై ఉండాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీ కోసం అప్లై చేసే అభ్యర్థులు 1999 జూలై 2 నుంచి 2003 జూలై 1 మధ్య జన్మించినవారై ఉండాలి.
దరఖాస్తు ఫీజు- రూ.200. ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ
పరీక్షా కేంద్రాలు- తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి.

ముఖ్యమైన తేదీలు..

  • దరఖాస్తు ప్రారంభ తేదీ- 2022 మే 18
  • దరఖాస్తుకు చివరి తేదీ- 2022 జూన్ 7 సాయంత్రం 6 గంటల వరకు
  • దరఖాస్తుల ఉపసంహరణ- 2022 జూన్ 14 నుంచి 2022 జూన్ 20 సాయంత్రం 6 గంటల వరకు
  • పరీక్ష తేదీ- 2022 సెప్టెంబర్ 4
  • కోర్సు ప్రారంభం- 2023 జులై
మొత్తం ఖాళీలు 339
ఇండియన్ మిలిటరీ అకాడమీ, దెహ్రాదూన్ 100
ఇండియన్ నావల్ అకాడమీ, ఎజ్హిమల 22
ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్ 32
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (పురుషులు) 169
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మహిళలు) 16

ఇవీ చదవండి: స్టేట్ బ్యాంక్​లో భారీగా ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.40వేలపైనే..!

కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేది ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.