ETV Bharat / bharat

బహిర్భూమికి వెళ్లి గంగా నదిలో పడ్డ వృద్ధురాలు.. 40 కిలోమీటర్లు కొట్టుకుపోయి.. - కౌశాంబి జిల్లా వార్తలు

బహిర్భూమికి వెళ్లిన ఓ వృద్ధురాలు అదుపు తప్పి గంగానదిలో పడిపోయింది. ఈ క్రమంలో నది ఉద్ధృతికి 40 కిలోమీటర్లు కొట్టుకుపోయింది. చివరకు ఏమైందంటే..?

UP woman slips into Ganges
గంగా నదిలో జారిపడ్డ వృద్ధురాలు
author img

By

Published : Oct 10, 2022, 10:47 PM IST

ఉత్తర్​ప్రదేశ్‌లోని ఫతేగఢ్ జిల్లాలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. బహిర్భూమికి వెళ్లిన ఓ 75 ఏళ్ల వృద్ధురాలు అదుపుతప్పి గంగానదిలో పడిపోయింది. నది ఉద్ధృతికి 40 కిలోమీటర్లు కొట్టుకుపోయింది. వృద్దురాలి కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికినా.. ఆచూకీ లభించకపోవడం వల్ల మరణించిందని భావించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆదివారం జరిగింది.

కౌశాంబి జిల్లాలోని కథువా గ్రామంలో శాంతి దేవి.. గంగానది ఒడ్డున పడి ఉండడం గమనించారు స్థానికులు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వృద్ధురాలిని ఆస్పత్రిలో చేర్పించారు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన వృద్ధురాలు తన అడ్రసును పోలీసులకు చెప్పింది. వృద్ధురాలు శాంతి దేవి స్వస్థలం.. హత్‌గవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షామాపుర్​గా పోలీసులు గుర్తించారు. పోలీసులు అతని అల్లుడు కేదార్​ లాల్​కు సమాచారం ఇవ్వడం వల్ల అతడు వచ్చి వృద్ధురాలిని ఇంటికి తీసుకెళ్లాడు.

ఇవీ చదవండి: ముష్కరులకు ముచ్చెటమటలు పట్టించిన శునకం... ఎన్​కౌంటర్​లో ఇద్దరు హతం

భర్తతో వివాదం.. ముగ్గురు పిల్లలతో బావిలో దూకిన తల్లి.. మట్టి దిబ్బ కూలి ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.