ETV Bharat / bharat

కూతురిపై అత్యాచార యత్నం.. నిలదీసిన తల్లి హత్య - ప్రయాగ్​రాజ్​ వార్తలు

కూతురిపై అత్యాచారయత్నం చేసిన యువకుడిని నిలదీసినందుకు ఆమె తల్లిని దారుణంగా కొట్టి చంపారు నిందితుని తరఫు బంధువులు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​లో జరిగింది.

UP: Woman beaten to death by locals of molesting her daughter
కూతురిపై అత్యాచారం.. నిలదీసిన తల్లి హత్య
author img

By

Published : Mar 13, 2021, 1:49 PM IST

తన కూతురిపై అత్యాచారయత్నం చేశాడని యువకుని కుటుంబ సభ్యులను ప్రశ్నించిన తల్లిని హతమార్చిన దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​​లో జరిగింది.

జిల్లాలోని బువాపూర్ గ్రామానికి చెందిన ఓ బాలిక సమీప పొలాల్లో మేకలను మేపేందుకు వెళ్లింది. ఆమెను నిందితుడు అడ్డగించాడు. లైగికంగా వేధించి ఆమె వస్త్రాలను చించేశాడు. సదరు బాలిక బిగ్గరగా కేకలు వేయడంతో పరారయ్యాడు. ఈ విషయాన్ని ఇంటికి వచ్చి తన తల్లికి వివరించింది బాలిక. బాలిక తల్లి యువకుని కుటుంబంపై.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన తల్లిని మరణంతో రోదిస్తోన్న కూతురు..

అయితే నిందితుని కుటుంబం అతడిపై ఎటువంటి చర్యలు తీసుకోక పోగా.. బంధువులతో పాటు వచ్చి బాలిక తల్లిని కొట్టారు. వీరి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె.. స్థానిక ఎస్​ఆర్​ఎన్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు యువకుడి కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఇదీ చదవండి: 'అత్యాచార బాధితులకు హక్కుల గురించి చెప్పాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.