UP Rape Case: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. సెలవులపై ఇంటికి వచ్చిన ఓ జవాను.. తన స్నేహితులతో కలిసి కళాశాల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముజఫర్‌పుర్ సర్దానా గ్రామంలో మార్చి 3న ఈ ఘటన జరిగింది.
woman gang raped by soldier:
ముజఫర్‌పుర్‌లో బీఏ మూడో సంవత్సరం చదువుతున్న యువతి.. కాలేజీకి వెళ్లి ఇంటికి వస్తున్న సమయంలో నిందితుడు అడ్డగించాడు. మాటలతో మభ్యపెట్టి దిల్లీకి తీసుకెళ్లారు. అనంతరం తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశారు.
గదిలో బంధించి హింసించారని బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. నిందితుల నుంచి తప్పించుకున్నానని వెల్లడించింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడిని శివగా గుర్తించారు. అతని స్నేహితులను అరుణ్, వరుణ్, అన్షు, సుమిత్‌గా గుర్తించారు. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
ఇదీ చదవండి: సహచరుడి కాల్పుల్లో ఐదుగురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి