UP polls third phase: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రజలు. 16 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 627 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 57.44 శాతం ఓటింగ్ నమోదైంది.

ఈ దశలోనే కీలక నేతలు బరిలో నిలుస్తున్న నియోజకవర్గాలకు ఓటింగ్ జరిగింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ బరిలో నిలిచిన కర్హల్, అయన బాబాయ్ శివపాల్ సింగ్ పోటీ చేస్తున్న జశ్వంత్‌నగర్‌కు సైతం పోలింగ్ పూర్తయింది. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తన ఓటు హక్కును.. సైఫాయ్‌లో తన భార్య డింపుల్ యాదవ్‌తో కలిసి వినియోగించుకున్నారు.


