ETV Bharat / bharat

యూపీలో భాజపాకు షాక్​- మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేల గుడ్​బై - భాజపా మంత్రి రాజీనామా

Swami Prasad Maurya News: ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి. భాజపాకు షాక్​ ఇస్తూ ఆ పార్టీకి చెందిన ఒక కేబినెట్ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు మంగళవారం రాజీనామా చేశారు. మంత్రి పదవి వదులుకున్న స్వామిప్రసాద్​ మౌర్య త్వరలో ఎస్​పీలో చేరనున్నారు. మరోవైపు​.. ఇంకో 13 మంది ఎమ్మెల్యేలు ఎస్​పీలో చేరతారని ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ జోస్యం చెప్పారు.

maurya prasad
మౌర్య ప్రసాద్
author img

By

Published : Jan 11, 2022, 2:57 PM IST

Updated : Jan 11, 2022, 7:50 PM IST

Swami Prasad Maurya News: ఉత్తర్​ప్రదేశ్​లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగుతాయనగా ​అక్కడి భాజాపా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో రాజీనామాల పర్వం మొదలైంది. మంగళవారం.. ఆ పార్టీకి చెందిన కేబినెట్​ మంత్రి స్వామిప్రసాద్​ మౌర్య పార్టీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. స్వామి ప్రసాద్​ రాజీనామా చేసిన గంటల వ్యవధిలో మరో ముగ్గురు భాజపా ఎమ్మెల్యేలు పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.

అదే కారణం..

దళితులు, రైతులు, నిరుద్యోగ యువత, చిన్నా-మధ్య తరగతి వ్యాపారులపై ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరే తన రాజీనామాకు కారణమన్నారు స్వామి ప్రసాద్​. గవర్నర్​ ఆనందీబెన్​ పటేల్​కు సమర్పించిన రాజీనామా లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు.

2016లో మౌర్య.. బహుజన్​ సమాజ్​ పార్టీ నుంచి భాజపాలో చేరారు. పద్రౌన నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు మౌర్య ఐదు సార్లు ఎమ్మెల్యేగా సేవలు అందించారు.

భాజపాకు స్వామి ప్రసాద్​ రాజీనామాను సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ స్వాగతించారు. 'సామాజిక న్యాయం, సమానతల కోసం పోరాడే స్వామి ప్రసాద్​ సహా ఆయన కార్యకర్తలు, మద్దతుదార్లను ఎస్​పీలోకి ఆహ్వానిస్తున్నాను. స్వామీ ప్రసాద్​ బుధవారం పార్టీలోకి చేర్చుకోనున్నాము.' అని అఖిలేశ్​ ట్వీట్​ చేశారు.

  • सामाजिक न्याय और समता-समानता की लड़ाई लड़ने वाले लोकप्रिय नेता श्री स्वामी प्रसाद मौर्या जी एवं उनके साथ आने वाले अन्य सभी नेताओं, कार्यकर्ताओं और समर्थकों का सपा में ससम्मान हार्दिक स्वागत एवं अभिनंदन!

    सामाजिक न्याय का इंक़लाब होगा ~ बाइस में बदलाव होगा#बाइसमेंबाइसिकल pic.twitter.com/BPvSK3GEDQ

    — Akhilesh Yadav (@yadavakhilesh) January 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గంటల వ్యవధిలో..

స్వామి ప్రసాద్​ రాజీనామా చేసిన కొన్ని గంటలకే మరో ముగ్గురు భాజపా ఎమ్మెల్యేలు పార్టీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. బ్రజేశ్​​ ప్రజాపతి, రోషన్​ లాల్, భగవతి సాగర్.. మౌర్యకు మద్దతుగా తాము పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. వీరంతా సమాజ్​వాదీ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు.. మౌర్య రాజీనామాతో ప్రస్తుతం భాజపాలో ఉన్న కీలక నేతలు దారా సింగ్​ చౌహాన్, ధరమ్​ సింగ్​ సైనీ, ​నంద్​గోపాల్​ గుప్తా కూడా సమాజ్​వాదీ పార్టీలలో చేరనున్నట్లు సమాచారం.

'తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు'

స్వామి ప్రసాద్‌ సహా పార్టీ నేతల రాజీనామాపై భాజపా స్పందించింది. స్వామి ప్రసాద్‌.. ఏ కారణాల వల్ల రాజీనామా చేశారో ఇప్పటికీ అర్థం కావడంలేదని యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ట్వీట్‌ చేశారు. తొందరపాటులో తీసుకున్న నిర్ణయాలు మంచివి కాదని హితవు పలికారు.

ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదు

స్వామి ప్రసాద్​ మౌర్య ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదన్నారు ఆయన కుమార్తె, భాజపా ఎంపీ సంఘమిత్ర మౌర్య. మరో రెండు రోజుల్లో తన తండ్రి తదుపరి కార్యచరణపై స్పష్టత వస్తుందన్నారు.

'భాజపా కార్యాలయం మూతపడాల్సిందే'

భాజపాలో వరుస రాజీనామాలపై సమాజ్​వాదీ పార్టీ ప్రతినిధి ఐపీ సింగ్​ స్పందించారు. త్వరలో భాజపా ప్రధాన కార్యాలయం మూతపడుతుందని జోస్యం చెప్పారు. అందుకే తాను రాష్ట్ర భాజపా చీఫ్​ స్వతంత్ర దేవ్​ సింగ్​ సహా మరో ఇద్దరు భాజపా నేతలకు తాళాలు పంపించానని ఎద్దేవా చేశారు. మార్చి 10 ఫలితాలు తర్వాత వారి కార్యాలయాలు మూసివేయడానికి ఆ తాళాలు ఉపయోగపడతాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఎస్​పీలోకి 13 మంది ఎమ్మెల్యేలు!

ప్రస్తుతం యూపీలో మొదలైన రాజీనామా పర్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ చీఫ్​ శరద్​ పవార్​. భాజపా ఎమ్మెల్యే స్వామి ప్రసాద్​ మౌర్య రాజీనామా నేపథ్యంలో ఎస్పీలో మరో 13 మంది ఎమ్మెల్యేలు చేరనున్నట్లు వెల్లడించారు.

ఫిబ్రవరి 10న ప్రారంభం కానున్న ఎన్నికలు దశ వారీగా జరుగుతుంది. ఫిబ్రవరి- 10, 14, 20, 23, 17 తేదీలు సహా మార్చి 3, 7 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10న ఎన్నికల ఫలితాయి తెలుస్తాయి.

ఇదీ చూడండి : 'పాఠశాల విద్యార్థులను ప్రలోభ పెట్టి అడవిబాట పట్టిస్తున్న నక్సల్స్​'

Last Updated : Jan 11, 2022, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.