ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా జిల్లా సెషన్స్ కోర్టు(పోక్సో).. అత్యాచార కేసులో ఓ దోషికి 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2019లో ఎనిమిదేళ్ల చిన్నారిపై అమిత్ కుమార్ అలియాస్ ఛోటన్ అఘాయిత్యానికి పాల్పడినట్లు రుజువు కావడం వల్ల.. న్యాయమూర్తి కుమార్ శర్మ ఈ తీర్పును వెలువరించారు. జైలు శిక్షతో పాటు రూ.24,000 జరిమానా విధించారు.
2019 అక్టోబర్ 27న.. బాందా జిల్లాలో నిందితుడు.. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఇదీ చదవండి: వివాహితకు మద్యం తాగించి.. ఆపై..!