ETV Bharat / bharat

మాజీ భార్యే సవతి తల్లి అయిందని తెలిస్తే...

author img

By

Published : Jul 4, 2021, 2:46 PM IST

Updated : Jul 4, 2021, 3:06 PM IST

ఇటీవల వెలుగు చూసిన ఓ ఘటన అందరినీ షాక్​కు గురిచేస్తోంది. కొన్నేళ్ల క్రితం మైనర్​గా ఉన్నప్పుడే ఇద్దరు పెళ్లిచేసుకున్నారు. ఆ తర్వాతి 6 నెలలకే వారు విడిపోయారు. కొంతకాలానికి ఆ యువకుడి తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఆయన కోసం వెతుకుతున్న క్రమంలో.. తనను వదిలేసిన మహిళను తండ్రి పెళ్లిచేసుకున్నాడని తెలిసి నివ్వెరపోయాడు ఆ కొడుకు. మాజీ భార్య కాస్తా.. ఇప్పుడు సవతి తల్లి అయ్యిందని తెలిసి షాక్​ అయ్యాడు. ఇదంతా ఉత్తర్​ప్రదేశ్​ బదాయూ జిల్లాలో జరిగింది.

estranged wife marries father
మాజీ భార్యే సవతి తల్లి అని తెలిస్తే!

తండ్రీకొడుకుల మధ్య ఆస్తి, చదువు, ఉద్యోగం విషయంలో గొడవలు రావడం సర్వ సాధారణం. ఈ కథల మీద ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. అయితే అన్నింటికీ భిన్నంగా, విన్న వారందరినీ షాక్​కు గురిచేస్తూ.. ఉత్తర్​ప్రదేశ్​ బదాయూ జిల్లాలో ఓ ఘటన జరిగింది. ఇక్కడ తండ్రీకొడుకులు గొడవపడింది ఓ మహిళ కోసం. కొడుకు నుంచి విడాకులు తీసుకున్న భార్య.. ఇప్పుడు తండ్రిని పెళ్లి చేసుకుంది. సరిగ్గా గమనిస్తే, అప్పటివరకు భార్యగా ఉన్న ఆమె.. ఆ కొడుకుకు ఇప్పుడు సవతి తల్లి అయ్యి కూర్చుంది. ఈ కథ వెనక ఓ హై డ్రామానే ఉంది.

ఇంట్లో నుంచి వెళ్లిపోయి..

2016లో సంబంధిత వ్యక్తికి ఓ అమ్మాయితో వివాహమైంది. అప్పటికి వారిద్దరూ మైనర్లే. కానీ 6 నెలల తర్వాత వారిద్దరూ విడిపోయారు. అమెతో తిరిగి బంధం ఏర్పరచుకునేందుకు అతను ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అతనొక తాగుబోతని, తనకు విముక్తి కావాలని చెప్పి ఆమె విడాకులు తీసుకుంది.

ఆ తర్వాత కొంతకాలానికి అతని తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. వెంటనే జిల్లా పంచాయతీ అధికారులను ఆశ్రయించాడు. తన తండ్రి వివరాలు సేకరించాలని ఆర్​టీఐ దాఖలు చేశాడు.

ఇదీ చూడండి:- కాబోయే కోడలు.. తన కూతురే అని తెలిస్తే?

ఇక్కడే అసలు కథ బయటపడింది. ఆ 48 ఏళ్ల తండ్రి.. కొన్నేళ్ల క్రితం కొడుకు పెళ్లిచేసుకున్న అమ్మాయిని తిరిగి వివాహమాడి, సంభాల్​ ప్రాంతంలో కలిసి జీవితం సాగిస్తున్నాడని తెలిసింది. అంటే.. భార్య స్థానంలో ఉన్న మహిళ ఇప్పుడు ఆ కొడుకుకు సవతి తల్లిగా మారింది! ఇక ఈ వార్త వినగానే ఆ కొడుకు నివ్వెరపోయాడు.

షాక్​ నుంచి తేరుకున్న తర్వాత ఆ వ్యక్తి బిసౌలీ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు తండ్రీకొడుకుల మధ్య ఇటీవలే ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ వారిద్దరూ వాగ్వివాదానికి దిగారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.

అయితే తల్లిగా మారిన ఆ మాజీ భార్య మాత్రం.. రెండో భర్తతోనే సుఖంగా ఉన్నట్టు వెల్లడించింది. మొదటి భర్త దగ్గరకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.

ఇదీ చూడండి:- పెళ్లయ్యాక భార్య.. మహిళ కాదని తెలిస్తే..

Last Updated : Jul 4, 2021, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.