Mango Wine: ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలకు త్వరలో మ్యాంగో వైన్ అందుబాటులోకి రాబోతుంది. అవును మీరు విన్నది నిజమే. ఇందుకోసం ప్రత్యేకంగా మద్యం విధానాన్ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది ఎక్సైజ్ శాఖ. 1974 తర్వాత రాష్ట్రంలో మద్యం విధానాన్ని సవరించాల్సి రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
వైన్ తయారీ యూనిట్లను రాష్ట్రంలోనే ఏర్పాటు చేయొచ్చని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. రూ. 70 లక్షలతో ఒక యూనిట్ ఏర్పాటవుతుందని అంచనా. ఇతరత్రా వాటికి అయితే.. మద్యాన్ని వేరే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం ద్వారా ధరలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆ బాధ లేదు.
Lack of Production of Grapes
సాధారణంగా వైన్ తయారీకి గ్రేప్స్(ద్రాక్ష పండ్లు) ఉపయోగిస్తారు. అయితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లో ద్రాక్ష ఉత్పత్తి ఆశించినంత లేదు. అందుకే వినూత్నరీతిలో ఆలోచించిన ఎక్సైజ్ శాఖ.. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇతర పండ్ల నుంచి వైన్ తయారుచేయాలని భావించింది.
Mango Wine Using Dussehri Mangoes: దేశంలోనే మామిడి పండ్లను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు మంచి పేరుంది. యూపీలోని మలిహాబాద్‌లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన దశ్హరీ మామిడిని పండిస్తారు. ఈ మామిడి పండ్లనే వైన్ తయారీకి ఉపయోగించనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
వైన్ పాలసీని సవరించడం రైతులకు లాభదాయకం అని చెబుతున్నారు ఎక్సైజ్ అధికారులు. ఇకపై రైతులు.. మామిడి పండ్లను ప్రభుత్వానికి నేరుగా విక్రయించవచ్చని అంటున్నారు.
ఇవీ చూడండి: ఆసక్తి రేపుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలు.. యూపీపైనే అందరి కళ్లు